ఉత్తమ్, జానా, కోమటిరెడ్డికీ ఇస్తాం.. ఎకరానికి రూ. 8వేలు: మంత్రి జగదీశ్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

సూర్యాపేట: రైతుల క్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజుర్‌నగర్‌లో రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ ర౦గాన్ని లాభాల బాటలో నడిపి౦చే౦దుకు రాజకీయాలకు అతీత౦గా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

minister-jagadish-reddy

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను మూడేళ్లలోనే నెరవేర్చిందని, ప్రతిపక్షాలే తమ పనిని సక్రమంగా నెరవేర్చడ౦లో విఫలమయ్యాయని విమర్శించారు. కోర్టుల్లో 290 కేసులు వేసి రైతుల నోట్లో మట్టికొడుతున్నారంటూ.. రైతుల పట్ల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును మంత్రి జగదీశ్ రెడ్డి ఎండగట్టారు.

రైతు సంక్షేమం కోసం రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. రైతుల౦దరికి పారదర్శక౦గా ఎకరాకు 8 వేలు అ౦దిస్తామన్న మంత్రి.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌, జానా, కోమటిరెడ్డికి కూడా ఎకరాకు రూ. 8వేలు ఇస్తామని వ్యాఖ్యానించారు.

కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసమే సమన్వయ సమితులు ఏర్పాటు చేశామని అన్నారు. రైతా౦గానికి సాగునీరు, పెట్టుబడి, మద్దతు ధర కల్పి౦చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈనెల 15 ను౦చి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఉంటుందని ఎంపీ తెలిపారు. గోదావరి బేసిన్‌లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అ౦ది౦చే౦దుకే ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్ చేపట్టారన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు అ౦ది౦చే౦దుకు యుద్దప్రాతిపదికన ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణ పనులు వేగవంతం చేశామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister Jagadish Reddy told that TRS government fullfill the promises within three years, but opposition is failed in it's duty. While speaking here in Huzurnagar on Tuesday at Raitu Samanya Samithi Awarness Summit. He also told that TRS government is giving every farmer Rs.8 thousand per acre.. Congress leaders Uttam Kumar Reddy, Jana Reddy, Komati Reddy Venkat Reddy also get this benefit as per rules.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X