• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణను నిందిస్తే ఏపి ప్రజలు హర్షిస్తారా.?వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : విద్యుత్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదాన్ని రగిలిస్తోంది. విద్యుత్ అంశపై స్పందిస్తున్న నాయకులు ఒకరిఒకరు షాకులు ఇచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నేతల మద్య షార్ట్ సర్క్యూట్ తగిలి మంటలు రాజేస్తున్నాయి. ఫిట్ మెంట్ అంశంతో పాటు విద్యుత్ విషయంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు వక్రభాష్యం చెప్తున్నారని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అభివృద్దిలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఏపి మంత్రులు జీర్నించుకోలేకపోతున్నారన్నారు క్రాంతి కిరణ్.

 తెలంగాణ పథకాలను విమర్శించొద్దు.. వైసీపి నేతలకు ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సూచన

తెలంగాణ పథకాలను విమర్శించొద్దు.. వైసీపి నేతలకు ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సూచన


ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పై వైయస్సార్సీపి జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. మంత్రి హరీష్ రావు చెప్పిన దాంట్లో తప్పేముందనీ ఆయన ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు మాట్లాడిన సందర్బం వేరు అయినప్పటికీ ఇష్టమొచ్చిన రీతిగా ఎపి మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా వుందని క్రాంతి కిరణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

 హరీష్ రావు వాస్తవం చెప్పారు.. ఏపి మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారన్న క్రాంతి

హరీష్ రావు వాస్తవం చెప్పారు.. ఏపి మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారన్న క్రాంతి


తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదని క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని మంత్రి మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇది వాస్తవం కాదా అని క్రాంతి కిరణ్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం చంద్రవేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాదిస్తుంటే తెలంగాణ పధకాలపై ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు చేసినా మేం పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తుపెట్టకోవాలి అని క్రాంతి అన్నారు.

 తెలంగాణ అభివృద్దిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎపీ మంత్రులపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్

తెలంగాణ అభివృద్దిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎపీ మంత్రులపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్


అంతే కాకుండా పొరుగు రాష్ట్రానికి సహజంగా ఈర్ష్య ఉండి ఉంటుందని, ఆ అంశాన్ని తాము పట్టించుకోవడం లేదన్నారు క్రాంతి. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సరికాదన్నారు. ఉద్యమ సమయంలో కూడా తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, తెలంగాణ సాధనకు అడ్డుగా వున్నవారిని వారినీ మాత్రమే వ్యతిరేకించాం, ఆ తర్వాత ప్రాంతీయ విభేదాలను పక్కనబెట్టి తెలంగాణలో అందరం కలిసి పనిచేస్తు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నామన్నారు క్రాంతి కిరణ్.

 మీడియా ప్రచారం కొసం విమర్శలా.?ఏపి నేతలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చురకలు

మీడియా ప్రచారం కొసం విమర్శలా.?ఏపి నేతలకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చురకలు


మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాల వారిపై గాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, సీఎం చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఇలా దుష్ప్రచారం మొదలుపెట్టారు అని క్రాంతి కిరణ్ విమర్సించారు. ఉచిత విద్యుత్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి నేడు వైయస్ ఆశయాలను తుంగలో తొక్కే నిర్ణయాలను వైయస్ఆర్ పార్టీ తీసుకున్నదని విరుచుకుపడ్డారు. నాణ్యమైన కరెంటు ఇస్తామంటూ, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేవలం మీడియా ప్రచారం కొసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై గాని, టిఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావు పై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని క్రాంతి కుమార్ కోరారు.

English summary
Andol MLA Kranti Kiran expressed his anger that AP Ministers are misinterpreting the comments made by Minister Harish Rao on the issue of fitment and electricity. Kranti Kiran said that the ministers of AP are unable to digest seeing Telangana state which is progressing in development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X