వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో సక్సెస్ అవుతుందా? రేవంత్ రెడ్డికి పెద్దటాస్క్!!

|
Google Oneindia TeluguNews

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అవుతుందా? రాహుల్ గాంధీ పాదయాత్రను సక్సెస్ చేయడం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారా? టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఇప్పటికే చిర్రుబుర్రులాడుతూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారా? అన్నది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు.. రేవంత్ రెడ్డి దూకుడు

కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు.. రేవంత్ రెడ్డి దూకుడు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి చాలా మంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సైతం వారిని పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. ప్రతి కార్యక్రమంలో తన మార్కు ఉండేలా చూసుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.

ఇక మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా, ఉప ఎన్నికలలో కీలక బాధ్యతలను కొందరు పార్టీ ముఖ్య నేతలకు అప్పగించినప్పటికీ, వారు పెద్దగా పట్టించుకోకపోవడంతో రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మునుగోడు ఉపఎన్నికల రాజకీయాలను సాగిస్తున్నారు.

అక్టోబర్ 24 నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర .. సక్సెస్ అవుతుందా?

అక్టోబర్ 24 నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర .. సక్సెస్ అవుతుందా?

ఇక తాజాగా అక్టోబరు 24వ తేదీ నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో సాగనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్ర ను సక్సెస్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటన ఏ నియోజకవర్గంలో సాగనుంది? నేతలు ఎవరెవరు పాల్గొనాలి? అన్న అంశంపై ఫైనల్ లిస్టు ను కూడా రెడీ చేశారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సక్సెస్ చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ పాదయాత్ర తెలంగాణాలో కాంగ్రెస్ మైలేజ్ కోసం మరో ఛాన్స్

రాహుల్ పాదయాత్ర తెలంగాణాలో కాంగ్రెస్ మైలేజ్ కోసం మరో ఛాన్స్

ఒకవేళ రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ అయితే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి దక్కే అవకాశం ఉంది కాబట్టి సహకరించరేమో అన్న అంశం కూడా ప్రధానంగా పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సెస్ అయితే ఆ మైలేజ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి లాభం చేకూరుస్తుంది.

తెలంగాణా కాంగ్రెస్ కు మైలేజ్ తెచ్చి పెడుతుంది. అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాత్రమే పాదయాత్ర సక్సెస్ ప్రతిఫలం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తే మాత్రం రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ లో ఫెయిల్ అవుతుంది. ఫలితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు తెలంగాణాల భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు.. సీనియర్లు రాహుల్ పాదయాత్రకు కలిసొస్తారా?

కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు.. సీనియర్లు రాహుల్ పాదయాత్రకు కలిసొస్తారా?

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ పాదయాత్ర ను సక్సెస్ చేయడం కోసం ప్రణాళికలు రచిస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇక మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాహుల యాత్ర సక్సే చెయ్యటానికి కలిసొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు, సీనియర్ల అలకల నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.

English summary
Will Rahul Gandhi Bharat Jodo Yatra be a success in Telangana? Congress seniors who did not cooperate with Revanth Reddy in the fight for supremacy, will Rahul's padayatra succeed? Revanth Reddy has a big task ahead with rahul tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X