వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ టీడిపీకి పూర్వవైభవం రానుందా.?కీలకం కానున్న ఖమ్మం సభ.!కాసాని కసరత్తులు ఫలిస్తాయా.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఉనికి లేని పార్టీకి ఊపిరిలు ఊదేందుకు, జాడలేని పార్టీలో జవసత్తువలు నింపేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. సరైన నాయకత్వం లేక చెల్లాచెదురైన పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు, కార్యకర్తల్లో నైతిక స్తైర్యాన్ని నూరి పోసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాద్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీలో కొత్త ఉత్సాహం తొనికిసలాడుతున్నట్టు తెలుస్తోంది.

 ఉనికిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న టీటీడిపి

ఉనికిని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న టీటీడిపి


పోగొట్టుకున్నచోటే వెత్తుక్కోవాలనే నానుడికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కట్టుబడిఉన్నట్టు తెలుస్తోంది. హేమాహేమీల్లాంటి పార్టీలను మట్టి కరిపించి, ఉద్దండుల్లాంటి రాజకీయ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుని దాదాపు పదమూడేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించింది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిన ఎంతో మంది యువతను ప్రముఖ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒకానొక దశలో రాజకీయ నాయకులను తయారు చేసే కార్మాగారంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు తెచ్చుకుంది.

క్యాడర్ మాత్రం పటిష్టంగా ఉంది..

క్యాడర్ మాత్రం పటిష్టంగా ఉంది..


కానీ కాల క్రమంలో కాలం కలిసిరాక కావాలనుకున్న నేతలు పార్టీని కాదనుకుని అర్ధాంతరంగా కాడిని వదిలేసినట్టు పార్టీని విడిచి వెళ్లిపోయాలు కీలక నేతలు. అంతే కాకుండా తెలంగాణలో క్రమక్రమంగా ముఖ్యనేతలు పార్టీని వీడి వెళ్లిపోవడం, పార్టీ కార్యకర్తల్లో అభద్రతాభావం చోటు చేసుకోవడం, టీడిపి శ్రేణుల్లో అయోమయం చోటుచేసుకోవండంతో పార్టీ ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్ధితులు నెలకొన్నాయి. ఏకంగా పార్టీ అద్యక్ష బాద్యతలు నిర్వహిస్తున్ని యల్ రమణ స్వయంగా పార్టీ మారడంతో దిక్కుతోచని పరిస్దితులు నెలకొన్నాయి. ముఖ్య నేతలు పార్టీని విడిచిపెడుతున్నా క్యాడర్ మాత్రం పటిష్టంగా ఉండడంతో పార్టీని మళ్లీ జవసత్తువలు నింపేందుకు టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్వకంగా అడుగులు వేసారు.

పూర్వవైభవం కోసం వినూత్న అడుగులు.

పూర్వవైభవం కోసం వినూత్న అడుగులు.

అందులో భాగంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వినూత్న ప్రయత్నాలు చేసారు చంద్రబాబు. 93కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, స్వతహాగా ప్రాంతీయ పార్టీని నడిపిన అనుభవమున్న బీసి నాయకుడు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాద్యతలను చంద్రబాబు కట్టబెట్టారు. పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గరనుండి ఒక్క రోజు కూడా విరామం లేకుండా పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పార్టీ నేతలో సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్ధాయిలో పార్టీ పరిస్ధితిని అంచనావేస్తున్నారు నూతన అద్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. అంతే కాకుండా తెలంగాణలో అభివృద్దికి కేంద్ర బిందువుగా మారిన తెలుగుదేశం పార్టీని మళ్లీ పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు వినూత్న వ్యూహరచన చేస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.

 కీలకం కానున్న ఖమ్మం సభ..

కీలకం కానున్న ఖమ్మం సభ..

ఇందులో భాగంగా ప్రభుత్వ లోపభూయిష్ట విధానల మీద కార్యచరణ రూపొందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పోరాటాలకు రూపకల్పన చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లోతుగా నిర్వహించడం, కొత్త ఇంఛార్జులను నియమించి నియోజక వర్గంలోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడమే కాకుండా, పార్టీ సంస్ధాగతంగా బలోపేతం మీద కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో భారీ భహిరంగ సభ నిర్వహించి పార్టీ ఉనికిని చాటి చెప్పేందుకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అద్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఈ సభ కోసం జన సమీకరణతో పాటు బహిరంగ సభను విజయవంతం చేయడం ఛాలెంజ్ గా పరిణమించింది. ఖమ్మం సభకు ఊహించని జనం వచ్చినా, సభ అనుకున్న దానికన్నా రెట్టింపు విజయం సాధించినా టీడిపిరి పూర్వవైభవం ఖాయమనే చర్చ జరుగుతోంది.

English summary
Since Kasani Gnaneshwar Mudiraj took charge as the new president of Telangana Telugu Desam Party, it seems that there is a new enthusiasm in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X