BRS: ఆ ఐదు స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదా.. కేసీఆర్ ఏం చెప్పారంటే..!
కొద్ది క్రితం వరకు అనారోగ్యంతో బాధపడిన కేసీఆర్.. తిరిగి ప్రచారం దృష్టి పెట్టారు. ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయ్యారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. 51 మంది అభ్యర్థులకు బీఫామ్ లు అందజేశారు. బీ ఫామ్ అందుకున్న వారిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, షకీల్, జోగురామన్న, మర్రి జనార్థన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, గణేష్ గుప్తా,జాన్సన్ నాయక్, అంజయ్య యాదవ్, పువ్వాడ అజయ్, రేగా కాంతారావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి తరుఫున ఎమ్మెల్సీ కవిత బీఫామ్ అందుకున్నారప. కొద్ది రోజుల క్రితమే ప్రశాంత్ రెడ్డి తల్లి చనిపోవడంతో ఆయన తరఫున కవితి బీఫామ్ తీసుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేసే సీఎం కేసీఆర్ తరఫున గంప గోవర్ధన్ తీసకున్నారు. జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. అభ్యర్థులకు బీఫామ్ తో పాటు రూ.40 లక్షల చెక్కును అందించారు. 51 మందికే బీఫామ్ లు ఇవ్వడంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అయితే సోవారం కూడా బీఫామ్ లు అందజేస్తామని పార్టీ అధిష్టానం పేర్కొంది. అభ్యర్థులతో సమావేశం సందర్భంగా కేసీఆర్ కీలక వాఖ్యలు చేశారు.

టికెట్ రానివారు తొందరపడొద్దని కోరారు. ఇంకా అవకాశాలుంటాయని చెప్పారు. ఇగోలు పక్కన బెట్టి కార్యకర్తలతో కలిసి పని చేయాలని ఆదేశించారు. పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఐదు స్థానాల్లో కేసీఆర్ అభ్యర్థులను మారుస్తారని బీఆర్ఎస్ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అందులో అలంపూర్, కోదాడ, వరంగల్ ఈస్ట్, మహబూబాబాద్, సంగారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. మేనిఫెస్టోన్ ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు బీమా చేయిస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు. బీసీల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. అసరా ఫించన్లు రూ.5 వేలకు పంచుతామని మేనిఫెస్టో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ఫించన్ యేటా రూ.500 పెంచుతూ పోతామని చెప్పారు.












Click it and Unblock the Notifications