త్వరలో టీఆర్ఎస్‘బీఆర్ఎస్’గా మారుతుందా? కేసీఆర్ జాతీయ రాజకీయాలపై రాష్ట్రంలో ఆసక్తికరచర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర ప్రజలలోనూ ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. నిజంగా కేసీఆర్ దేశ రాజకీయాలను మారుస్తాడా? ఆయనకు ఆ సత్తా ఉందా? కేసీఆర్ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతారా? లేక కెసిఆర్ చేస్తున్న కొత్త ప్రయోగంతో తెలంగాణ రాష్ట్రంలోనూ ఉనికిని కోల్పోతారా? అన్న చర్చ ప్రధానంగా కొనసాగుతుంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాలు.. ప్రత్యామ్నాయ అజెండాపై ఆసక్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ స్వపరిపాలన సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తున్నారు. రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ సమయంలో భవిష్యత్తులో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ తాను ఎవరినో గద్దె దించడం కోసం పని చేయనని తేల్చి చెప్పానని పేర్కొన్న కెసిఆర్ దేశానికి ఇప్పుడు కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదని, ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా అంటూ పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం కెసిఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలలో భిన్నాభిప్రాయాలు
అందులో భాగంగానే చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని అంటున్నారని కేసీఆర్ వెల్లడించారు. కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలని, సందర్భానుసారం స్పందించే గుణం ఉండాలని పేర్కొన్న కేసీఆర్ దేశంలో తుఫాను సృష్టించి దుర్మార్గాలను తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కెసిఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం నుంచి జాతీయ రాజకీయాలపై మాట మెదపని కేసీఆర్, ఇప్పుడు జాతీయ రాజకీయాలపై మాట్లాడుతుండటం వెనుక ఆంతర్యం కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమేనా అంటూ చర్చిస్తున్నారు. మరికొందరు కెసిఆర్ జాతీయ రాజకీయాలు అనవసర ప్రయోగమని వ్యాఖ్యానిస్తున్నారు.

కెసిఆర్ జాతీయ రాజకీయాలు చేయడం మాటలు చెప్పినంత ఈజీ కాదని చర్చ
ఇంకొందరైతే తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రాభవం తగ్గిందని, ఇక ఇలాంటి సమయంలో కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి మళ్ళిస్తే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతినే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. కెసిఆర్ జాతీయ రాజకీయాలు చేయడం మాటలు చెప్పినంత ఈజీ కాదని ఇటు రాజకీయ వర్గాలలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబు మోడీని ఢీ కొట్టాలని ఇదే తరహా రాజకీయాలు చేసి దారుణంగా దెబ్బతిన్నాడని చర్చిస్తున్నారు.

జాతీయ రాజకీయాలను మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ
పదే పదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము అని చెబుతున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యం కాలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సబ్బండ వర్ణాల వారు ఏకకంఠంతో ఉద్యమిస్తే, ఎంతోమంది ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ కూటమిలో కలవకుండా తానొక్కడినే జాతీయ రాజకీయాలను మార్చడానికి రంగంలోకి దిగుతానని కేసీఆర్ చెబుతున్న నేపథ్యంపైన జోరుగా చర్చ సాగుతోంది.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారిస్తే కేసీఆర్ సక్సెస్ అవుతారా ?
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ గా మార్చి కెసిఆర్ రాజకీయాలు చేస్తే ఏ మేరకు సక్సెస్ అవుతారు అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్ప, ఇతర రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎక్కడ పోటీ చేయని, ఇతర రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా గుర్తింపు పొందని టిఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లోకి వెళితే కె సి ఆర్ చెప్పినట్లు సక్సెస్ సాధించడం సాధ్యమేనా అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతుంది. దేశంలో తుఫాను సృష్టించి దుర్మార్గాలను తరిమేస్తాం అని చెబుతున్న కేసీఆర్ అన్నంత పని చేస్తారా? లేక ఆ తుఫానులో టిఆర్ఎస్ కొట్టుకుపోయేలా చేస్తారా అంటూ రకరకాలుగా కేసీఆర్ ప్రసంగం పై ప్రజలు చర్చిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications