అది ముగిసిన అధ్యాయం, ఉత్తమ్‌తో కలిసి పనిచేస్తా: కోమటిరెడ్డి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని కోమటిరెడ్డి సోదరులు ఆశించారు. అయితే ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం పాత పీసీసీ అధ్యక్షులను కొనసాగించాలనే నిర్ణయం కోమటిరెడ్డి సోదరులకు నిరాశే మిగిల్చింది.అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరితో కలిసి పనిచేయనున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే తాను చేసిన విమర్శలు ముగిసిన అధ్యాయమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కోమటిరెడ్డి సోదరులు కొంత కాలం క్రితం డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ కుంతియాకు ఫిర్యాదు కూడ చేసింది.

దివాళా కంపెనీలతో ఒప్పందాలు, మాట వినలేదని ఐఎఎస్‌లను తప్పించారు: కెసిఆర్‌పై రేవంత్ సంచలనం

2019 ఎన్నికల వరకు కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడం ఈ పదవిని ఆశిస్తున్న నేతలకు మాత్రం మింగుడుపడలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు.

అందరం కలిసి పిచేస్తాం

అందరం కలిసి పిచేస్తాం

కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి పనిచేయనున్నట్టు సిఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో వేరొకరు ఉన్నా కూడ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సమన్వయం చేసుకొంటున్నట్టు పని చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్‌తో విభేధాలు: డి.శ్రీనివాస్

పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన మాట వాస్తవమే

పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన మాట వాస్తవమే

పీసీసీ చీఫ్ పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్న కారణంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలున్నారు

కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలున్నారు

కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తన లాంటి నేతలు చాలా మంది ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచన మేరకు పాదయాత్రనైనా, బస్సు యాత్రలు చేసేందుకు కూడ తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఉత్తమ్ పై చేసిన వ్యాఖ్యలు ముగిసిన అధ్యాయం

ఉత్తమ్ పై చేసిన వ్యాఖ్యలు ముగిసిన అధ్యాయం

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఈ వివాదం ముగిసిన అధ్యాయమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will work together with TPCC president Uttamkumar Reddy and other Congress leaders said CLP deputy leader Komatireddy Venkat Reddy. A telugu channel interviewed him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి