వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్ జోన్లలో వైన్స్ ఓపెన్, 15 షాపులు మాత్రం క్లోజ్, మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులు ఓపెన్..

|
Google Oneindia TeluguNews

రెడ్ జోన్ పరిధిలో వైన్ షాపులు తెరుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కంటైన్మెంట్ జోన్ తప్ప అన్ని జోన్లలో వైన్ షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీటికి అనుమతులు...

వీటికి అనుమతులు...

రెడ్ జోన్లలో కేంద్రం సూచించిన షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తామని కేసీఆర్ తెలిపారు. భవన నిర్మాణం కోసం అవసరమయ్యే హార్డ్ వేర్ షాపులు, సిమెంట్, స్టీల్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, వ్యవసాయ పనిముట్ల దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు తెరిచి ఉంాయని చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.

 మున్సిపాలిటీ పట్టణాల్లో 50 శాతం..

మున్సిపాలిటీ పట్టణాల్లో 50 శాతం..

గ్రామాల్లో అన్ని షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మున్సిపాలిటీ గల పట్టణాల్లో మాత్రం 50 శాతం చొప్పున షాపులు తెరుస్తాయని.. ఇందుకోసం లాటరీ ద్వారా షాపులను ఎంపికచేస్తామని చెప్పారు. మిగతా 50 శాతం షాపులకు మరునాడు ఓపెన్ చేసేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు.

Recommended Video

Viral Video : Watch How People Are Crazy To Get Wine | Oneindia Telugu
ఇక్కడే ఎక్కువ..

ఇక్కడే ఎక్కువ..

వైరస్ వ్యాప్తి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలోనే ఉంది అని కేసీఆర్ వివరించారు. 66 శాతం కేసులు అంటే 726 కేసులు ఇక్కడే నమోదయ్యాయని పేర్కొన్నారు. మిగతా 34 శాతం రాష్ట్రంలో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. మృతుల సంఖ్య కూడా 86 శాతం అంటే 25 మంది ఇక్కడే చనిపోయారని తెలిపారు. గద్వాల, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్‌లో క్రమంగా కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. కరోనాను పూర్తిగా నిర్మూలించాలంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ముంబై లాంటి పరిస్థితి రావొద్దంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
wine shops will be open in red zone areas in telangana state cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X