తెలంగాణలోనే మాంసాహారులు ఎక్కువ, గుజరాత్‌లో 40 శాతం మంది
న్యూఢిల్లీ: తెలంగాణలో 98.7 శాతం మంది మాంసాహారులుగా తేలింది. శాఖాహారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. గుజరాత్ రాష్ట్రంలో ప్రతి ఐదుగుగురిలో ఇద్దరు మాంసాహారులు. అంటే గుజరాత్‌లో మాంసాహారుల శాతం వందకు నలభైగా ఉంది.
శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) డేటా దేశంలో ఏ మాంసాహారులు ఎంతమంది? ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు? అని 2014లో చేసిన సర్వే తెలియజేస్తోంది. ఆ లెక్కల ప్రకారం గుజరాత్‌లో 61.80 శాతం మంది శాఖాహారులు. 39.05 శాతం మాంసాహారులు.

తెలంగాణలో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం 98.7గా ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి. మాంసాహారం భుజిస్తున్న వారిలో తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంది. ఆ రాష్ట్రంలో 98.55 శాతం మంది మాంసాహారం తీసుకుంటారని సర్వే తెలిపింది.
ఈ రెండు రాష్ట్రాల తర్వాత ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో వరసగా 97.35, 97 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. గుజరాత్‌లో పురుషులు మాంసాహారాన్ని ఎంతగా తింటున్నారో దాదాపు అదే సంఖ్యలో స్త్రీలు కూడా తీసుకుంటున్నారని పేర్కొంది.
గుజరాత్ కంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో మాంసాహారం తినే వారు తక్కువ. భారత దేశంలో 71 శాతం మంది ప్రజలు మాంసాహారం తింటారని, శాఖాహారం తినే వారు 28.85 శాతంగా ఉందని పేర్కొంది. తెలంగాణలో 98.7 శాతం మంది మాంసాహారం తీసుకుంటారు. ఇందులో మాంసం, కోడి మాంసం, చేపలు తినే వారు ఎక్కువగా ఉన్నారు.












Click it and Unblock the Notifications