‘నా మనసు తెలుసుకోలేదు.. ఎన్నోసార్లు బాధ పెట్టావు’: వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: ఓ మహిళ తన భర్త తనను అందరూ ముందు చులకనగా మాట్లాడుతున్నాడని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ వాణినగర్‌లో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా కె. సముద్రం గ్రామానికి చెందిన అమరేందర్, బి స్వప్న(23)కు 2013లో వివాహమైంది. వీరు హైదరాబాద్ చింతల్‌లోని వాణినగర్‌లో ఉంటున్నారు. అమరేందర్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది.

తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం మధ్యాహ్నం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన మృతికి ఎవరూ కారణం కాదని ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.
‘సారీ బావా.. నాకు తెలిసి ఎవరినీ ఏమీ అనలేదు. నేను ఎవరినీ బాధ పెట్టలేదు. ఒక వేళ పెడితే సారీ.. కానీ నువ్వు నన్ను చాలా సార్లు బాధ పెట్టావు. నేను నీ లైఫ్‌లో ఉండకపోతే హ్యాపీగా ఉంటావని నాకు తెలుసు. పాప జాగ్రత్త. కానీ నువ్వు ఎప్పుడూ నా మనసు తెలుసుకోలేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. పాపను చూసుకుంటూ బతకాలని ఉన్నా.. నువ్వు అన్న మాటలకు బతక బుద్ధి కావడం లేదు' అని తన సూసైడ్ నోట్‌లో మృతురాలు పేర్కొంది.












Click it and Unblock the Notifications