పెళ్లైన కొత్తలోనే ప్రియురాలితో భర్త రాసలీలలు: ఆమె ప్రాణం తీసింది
హైదరాబాద్: పెద్ద చదువులు చదివిన ఆ వ్యక్తి సంస్కారవంతుడనుకున్నారు. అల్లారుముద్దుగా పెంచిన కూతురును అతనికిచ్చి వివాహం చేశారు. కానీ, వివాహమైన కొద్ది రోజులకే అతడు ప్రియురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. అంతేగాక, ఆమెతో ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఈ విషయం తెలియడంతో మనస్థాపానికి గురైన అతడి భార్య బలబన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్ల పోలీసుల తెలిపిన ప్రకారం... రామగుండంకు చెందిన విష్ణువర్ధన్, లక్ష్మి
దంపతుల కుమారుడు సుచిన్‌రెడ్డి(27), టీఎస్‌ఐఐసీ కాలనీకి చెందిన సత్తిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె నీరజారెడ్డి(25)కి ఫిబ్రవరి 16, 2017లో వివాహమైంది. నీరజారెడ్డి బీఫార్మసీ చేసింది. కాగా, సుచిన్‌రెడ్డి తనకు బెంగళూరులో వ్యాపారం ఉందని పెళ్లి సమయంలో చెప్పాడు. దీంతో రూ.40 లక్షలు కట్నంగా ఇచ్చారు.

వివాహం అనంతరం అతను భార్యతో కలిసి అల్వాల్‌కు మకాం మార్చాడు. ఇక్కడ ఏపనీ చేయకుండా కట్నం డబ్బుతోనే కాలం వెళ్లదీయసాగాడు అంతేగాక,. వివాహానికి ముందునుంచే ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. తరచూ ఫోన్‌లో ఆమెతో సంభాషిస్తుండటంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మానుకోవాలని ఆమె ఎంత చెప్పినా అతను పట్టించుకోలేదు.

కాగా, భర్త ప్రేమిస్తున్న యువతికి కుమార్తె పుట్టినట్లు తెలియడంతో నీరజారెడ్డి రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నీరజ సోమవారం ఉదయం తనగదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని జీడిమెట్ల పోలీసులకు సత్తిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సుచిన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications