నాపై నలుగురు రేప్ చేశారని యువతి ఫిర్యాదు, శంషాబాద్‌లో బంగారం స్వాధీనం

హైదరాబాద్: హైదరాబాదులో ఘోరం వెలుగు చూసింది. ఓ యువతి పైన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లగా తెలుస్తోంది. తన పైన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితద యువతి పాతబస్తీలోని కామాటిపుర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కుటుంబం ఆత్మహత్యాయత్నం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో భూవివాదం కారణంగా ఓ కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని స్థానికులు గుర్తించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Woman allegedly raped by four youth

విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం

భాగ్యనగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణీకుల నుంచి కస్టమ్స్ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలో దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది దొంగల నుంచి రూ. 11 వేలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.

బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లాలోని కోహెడ ఎల్లమ్మ గుడి వద్ద బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కోహెడ్‌ గ్రామానికి చెందిన నవీన్‌, శిరీషగా గుర్తించారని తెలుస్తోంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+