పూటుగా మద్యం సేవించి.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మహిళ
హైదరాబాద్: వారాంతం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కాగా, బంజారాహిల్స్‌లో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో చాలామంంది మందుబాబులు పట్టుబడ్డారు.
రాత్రివేళ అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ వారికి చుక్కలు చూపింది. బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఆమెతో పరీక్ష పూర్తి చేయించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.
నోటి నుంచి గాలి ఊదకుండా ఉద్దేశపూర్వకంగా పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. చివరకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించి ఆమె మద్యం అతిగా మద్యం తాగినట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని కారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో మొత్తం 7 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, ఓ బస్సును స్వాధీనం చేసుకున్నారు. వీరికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నగల చోరీ: ఇద్దరు యువకుల అరెస్ట్
ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని మభ్యపెట్టి 185 గ్రాముల బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు యువకులను సైదాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. డీఐ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ సత్యనారాయణ కాలనీలో కుంభం రామవర్ధనమ్మ(80) ఒంటరిగా ఉంటోంది. పక్కనే ఉండే పి అభిషేక్(19) ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
తరచూ వృద్ధురాలిని పలకరించేవాడు. ఐటిఐ చదువుతున్న తుర్కయాంజల్‌కు చెందిన స్నేహితుడు బి ప్రణయ్(19)తో కలిసి మే 24న ఆమె ఇంటికి చేరారు. అభిషేక్ ఆమెను మాటల్లో దింపగా ప్రణయ్ 185 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న సంచిని తస్కరించి జారుకున్నారు. నగలు కనిపించకపోవడంతో కుమారుడి ద్వారా ఆమె 25న సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications