సెల్‌ఫోన్‌లో నిత్యం చాటింగ్: తల్లి బెదరింపు, ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ అమ్మాయి ఒంటి పైన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లాలోని కొండకల్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొడంగల్ గ్రామానికి చెందిన పుణ్యవతి కుమార్తె శృతి (20) వట్టినాగులపల్లిలోని ఎస్‌ఎస్‌జే ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది.

తరచూ సెల్ ఫోన్లో మాట్లాడుతుండటం, చాటింగ్ చేస్తుండటం తల్లి గమమనించింది. ఈ విషయంపై కూతురును మందలించింది. ఫోన్ లాక్కుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటి పైన కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది.
ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications