మృగంలా వేటాడింది వీడే: స్రవంతి పరిస్థితి విషమం.. వాళ్లు అడ్డుకోకపోతే ఏమయ్యేదో!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎర్రగడ్డ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ప్రాంతంలో యువతిపై ప్రేమోన్మాది దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. రవి అనే ఆ ప్రేమోన్మాది దాడిలో స్రవంతి అనే వివాహిత తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మృగంలా వేటాడాడు: పెళ్లయినా వదల్లేదు!, ఎర్రగడ్డలో పట్టపగలు  

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు అతన్ని రిమాండ్ కు తరలించినట్టు ఇన్ స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు.

స్రవంతి పరిస్థితి విషమం:

స్రవంతి పరిస్థితి విషమం:

ప్రేమోన్మాది చేతిలో గాయపడిన స్రవంతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి శరీరంపై ఏడు కత్తి పోట్లు ఉన్నాయని, తక్షణ వైద్య సహాయం అందకపోవడంతో తీవ్ర రక్త స్రావం జరిగిందన్నారు. బాధితురాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

స్థానికులు అడ్డుకోకపోతే ఏమయ్యేదో?:

స్థానికులు అడ్డుకోకపోతే ఏమయ్యేదో?:

కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో రవి స్రవంతిపై దాడికి తెగబడ్డాడు. నిజానికి ఆ సమయంలో స్థానికులు అడ్డుకోబట్టి స్రవంతి ప్రాణాలు దక్కాయి కానీ లేదంటే అక్కడే ఆమె హత్యకు గురై ఉండేదని తెలుస్తోంది. మెడ, చేతి భాగంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చిటికెన వేలు తెగిపోయినట్టు తెలుస్తోంది.

 వేధింపులతో టార్చర్:

వేధింపులతో టార్చర్:

పెళ్లికి ముందు, పెళ్లయ్యాక స్రవంతి రవి నుంచి వేధింపులు చవిచూస్తూనే ఉంది. స్రవంతి భర్త రవిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అతని వేధింపులతో ఆఖరికి స్రవంతి దంపతులు ఇల్లు కూడా మారారు. అక్కడికి వచ్చి మరీ రవి తమ పరువు తీస్తుండటంతో స్రవంతి ఇక అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది.

ఇంట్లో చెప్పడంతో:

ఇంట్లో చెప్పడంతో:

తన వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో రవి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. విషయం తెలుసుకుని రోడ్డుపై ఆమెను వెంబడించాడు. బైక్ తో ఆమెకు అడ్డుపడి వాగ్వాదానికి దిగాడు. నడిరోడ్డు పైనే ఆమెతో పెనుగులాడి కొబ్బరిబోండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్రవంతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a woman here was attacked with a sickle by her friend following an argument. The victim received critical injuries in the attack and was rushed to a hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి