ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ చెరువులో శవమై...
హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి, కనిపించకుండా పోయిన మహిళ శంషాబాద్ ప్రాంతంలోని కాముని చెరువులో శవమై తేలింది. శంషాబాద్ మండల కేంద్రంలోని సిద్ధేశ్వర కాలనీలకి చెందిన పస్తం రమేష్ భార్య సుగుణ (22) కూరగాయలు తెస్తానని ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరింది.
ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని చోట్లా వెతికారు. గురువారం సాయంత్రం ఆర్‌డిఐఎ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళ అదృశ్యమైందంటూ కేసు నమోదు చేసుకున్నారు.

కాముని చెరువులో ఓ మహిళ శవం తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పిలిపించి, మృతదేహం సుగుణది అని నిర్ధారించారు.
ఇంట్లో తరుచుగా చోటు చేసుకుంటున్న కుటుంబ కలహాల కారణంగానే సుగుణ ఆత్మహత్యకు పాల్పడిందని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్‌తో సుగుణ వివాహం పది నెలల కిందటే జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు.












Click it and Unblock the Notifications