రూ.8 కోట్లు ఇస్తేనే పెళ్లి: యువతికి ఫేస్‌బుక్ ప్రేమ షాక్, వివాహిత ఆందోళన
హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే పెళ్లికి మాత్రం కట్నం అడ్డు వస్తోంది. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. తనకు ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తేనే ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని యువకుడు చెబుతున్నాడని తెలుస్తోంది.
హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న రణధీర్ అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌లో కీర్తి అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవాలంటే తనకు భారీ కట్నం ఇవ్వాలని అతను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
తనకు రూ.8 కోట్ల రూపాయలు కట్నంగా ఇస్తే పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్పాడని సమాచారం. దీంతో, కీర్తి ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

వివాహిత ఆందోళన
హైదరాబాదులోని బషీర్ బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట కల్యాణి అనే వివాహిత ఆరు నెలల కుమార్తెతో పాటు ఆందోళన చేపట్టింది. అదనపు కట్నం తీసుకు రావాలని తన భర్త తనను ఇంటి నుంచి గెంటేశాడని మహిళ చెబుతోంది. భర్త పైన ఆమె సిపికి ఫిర్యాదు చేసింది. కల్యాణ్ భర్త అంబర్ పేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇంటిలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం లింగాపూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి.
స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications