ప్రేమించి మోసం చేశాడని, 15 ఏళ్ల బాలుడి ఇంటి వద్ద ధర్నా!
ఖమ్మం: తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ ఓ యువతి ఓ బాలుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె అతని ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కారేపల్లి మండల పరిధిలోని ఓ తండాకు చెందిన పదిహేడేళ్ల బాలిక కారేపల్లిలో ఇంటర్ చదువుతోంది. పదవ తరగతి వరకు చదువుకొని కూలీ పనులు చేసుకుంటున్న పదిహేను సంవత్సరాల బాలుడితో కొంతకాలంగా ప్రేమలో పడింది.

ఇరువురు ప్రేమించుకున్నారు. అయితే, కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పది రోజుల క్రితం యువతి అతని ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని అడిగింది. దానికి అతడు నిరాకరించాడు.
దీంతో, యువతి పోలీసులను ఆశ్రయించింది. మైనార్టీ తీరని వారు పెళ్లి చేసుకోవడం కుదరదని అలా చేసుకుంటే చట్టరీత్యా నేరం అవుతుందని పోలీసులు చెప్పి పంపించారు. మంగళవారం ఉదయం బాలిక ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి, న్యాయ పోరాటానికి దిగింది. వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications