ALERT: రాష్ట్రంలోకి డేంజర్ వైరస్.. తొలి మరణం నమోదు
అన్నంత పనీ అయింది. రాష్ట్రంలోకి డేంజర్ వైరస్ గా పిలిచే గిలియన్ బార్ సిండ్రోమ్ వైరస్ ప్రవేశించింది. ఈ వైరస్ బారిన పడి ఓ మహిళ మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సిద్ధిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన ఓ వివాహిత నెల రోజుల క్రితం నరాల నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నిమ్స్ తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తిప్పారు. రూ. లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో ఆమె నిన్న చికిత్స పొందుతూ మృతి చెందింది. మహిళ మరణంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఏంటి ఈ వైరస్..?:
ఈ వైరస్ పేరు గులియన్ బారే సిండ్రోమ్. ఈ గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ బారినపడిన వారికి
ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా,పొత్తి కడుపు నొప్పి, జ్వరం,వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

కారణాలు ఏంటి..?
కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది.ఇప్పటికే అక్కడ వందల మందికి పైగా ఈ వైరస్ సోకింది.












Click it and Unblock the Notifications