ఆమెకు 16 ఏళ్ల ప్రియుడు: అతనితో కలిసి భర్తను చంపి బైక్‌పై శవాన్ని తరలిస్తూ....

హైదరాబాద్: తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఓ మహిళ తన ప్రియుడి(16)తో కలిసి భర్తను చంపేసింది. ఆ తర్వాత బైక్‌ మీద శవాన్ని తరలిస్తూ పోలీసులకు అతనితో పాటు పట్టుబడింది. ఈ సంఘటన శనివారం రాత్రి హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.

నల్లగొండ జిల్లా నల్లబండగూడెం గ్రామానికి చెందిన పుల్లయ్య ప్రవళ్లికను 2006లో పెళ్లి చేసుకున్నాడు. పుల్లయ్య కోదాడ వ్యవసాయ మార్కెట్‌లో జూనియర్‌ సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నాడు. ప్రవళ్లిక , వరసకు అల్లుడైన 16 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు.

నెల రోజుల క్రితం హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో గల మైత్రినగర్‌కు మకాం మార్చారు. దీంతో పుల్లయ్య మీద ప్రవళ్లిక, ఆమె ప్రియుడు కసి పెంచుకున్నారు. ఎలాగైనా భర్త అడ్డు తప్పించాలని భావించిన ప్రవళ్లిక, ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. శనివారం ప్రవళ్లిక ప్రియుడు పులయ్య ఇంటికి వచ్చాడు. పుల్లయ్యతో కలిసి మద్యం సేవించాడు.

మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య మీద అతడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దాడి చేసి మర్మాంగాలను గాయపరిచారు.గొంతు నొక్కి చంపారు. తెల్లవారకముందే మృతదేహాన్ని నగర శివారులో పాతేయాలని భావించారు. రాత్రి 11.40 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తీసుకుని ప్రవళ్లిక, ఆమె ప్రియుడు బయలుదేరారు.

Woman killed husband with the help of lover at hayathnagar

పెద్దఅంబర్‌పేట్‌ చెక్‌ పోస్టు దగ్గర పోలీసులు వారిని చూసి అనుమానించి వెంబడించారు. అడ్డగించి పోలీసులు ప్రశ్నించగా తమ వద్ద డబ్బులు లేవని, చనిపోయిన భర్త మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నామంటూ కట్టుకథలు అల్లుతూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో హత్య చేసి శవాన్ని పడేసేందుకు వెళ్తున్నారనే విషయం వెలుగుచూసింది.

పుల్లయ్య(36), ప్రవల్లిక(25)లకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. పెద్దమనుషులు కూడా దూరప్రాంతానికి వెళ్తే ప్రవల్లికలో మార్పు వస్తుందని సూచించారు. అప్పటికే మనస్తాపంతో కృంగిపోతున్న పుల్లయ్య పిల్లలను తమ కుటుంబ సభ్యుల వద్ద వదిలేసి, ఈనెల 7వ తేదీన భార్యను తీసుకొని నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. ఈ క్రమంలో 24వ తేదీన ప్రవల్లిక, తన అల్లుడిని రమ్మని చెప్పడంతో అతడు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే హత్య జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+