అర్ధరాత్రి కారు బీభత్సం: ఒకరు మృతి, మరొకరి బ్రెయిన్ డెడ్, కళ్లు మూసి తెరిచేలోపు

Posted By:
Subscribe to Oneindia Telugu
  జూబ్లీహిల్స్ ప్రమాదం : మహిళల సెల్‌పోన్లలో అభ్యంతరక వీడియోలు, పలు కోణాలు !

  హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఆదివారం వేకువజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్టకు చెందిన విష్ణువర్ధన్ అనే వ్యక్తి అతివేగంతో కారును నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీ నడుపుతున్న శ్రీనగర్‌కు చెందిన మస్తానీ అనే యువతి అక్కడికి అక్కడే మృతి చెందింది.

  ఇద్దరికి తీవ్ర గాయాలు

  ఇద్దరికి తీవ్ర గాయాలు

  స్కూటీ వెనుక సీట్లో కూర్చున్న అనూష, ప్రియ అనే ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం తాగి కారు నడిపిన విష్ణును పోలీసులు అరెస్టు చేసారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూషకు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెకు వెంటిలెటర్ పైన చికిత్స కొనసాగుతోంది. మరో యువతి ప్రియకు కాలు విరిగింది. ప్రియా అలియాస్ అనూష రెడ్డి అలియాస్ వెంకటలక్ష్మి సొంతూరు విశాఖపట్నం. మరో మహిళ అనూష సొంతూరూ రాజమండ్రి. మస్తానీ సొంతూరు తాడేపల్లిగూడెం.

  కారును మద్యం మత్తులో వేగంగా తోలడం వలన

  కారును మద్యం మత్తులో వేగంగా తోలడం వలన

  ఈ ప్రమాదం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో అర్ధరాత్రి ఒకటి గంటల తర్వాత జరిగింది. విష్ణు మద్యం మత్తులో కారును వేగంగా తోలడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  అనూషను పికప్ చేసుకొని వస్తుండగా

  అనూషను పికప్ చేసుకొని వస్తుండగా

  మస్తానీ, అనూషలు ప్రతివారం కిడ్డీ పార్టీలో పాల్గొనేవారని తెలుస్తోంది. మస్తానీ ప్రతినెస కిడ్డీ పార్టీ పేరుతో ఫ్రెండ్స్ పార్టీలు ఇచ్చేవారు. అనూష ఇటీవలే కిట్టీ పార్టీలో చేరారని సమాచారం. కిడ్డీ పార్టీ గ్రూప్‌లో కొత్తగా చేరిన అనూష కోసం యూసుఫ్‌గూడలో ఆదివారం మద్యాహ్నం పార్టీ ఏర్పాటు చేశారు. అనూష తాడేపల్లిగూడెం ఇటీవల వచ్చింది. అనూషను పికప్ చేసుకునేందుకు మస్తానీ, ప్రియ కూకట్‌పల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

  అర్ధరాత్రి తనిఖీలు ఉండవని భావించి

  అర్ధరాత్రి తనిఖీలు ఉండవని భావించి

  విష్ణు కొండాపూర్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు. మద్యం సేవించాడు. అర్ధరాత్రి ఒకటి గంటల తర్వాత తనిఖీలు ఉండవని భావించాడు. అందుకే తాగి ఇంటికి వెళ్లవచ్చునని అనుకున్నాడు. తన కారులో వస్తూ వారు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టాడు

  అక్కడే తనిఖీలు జరిగితే ప్రమాదం జరిగి ఉండేది కాదని

  అక్కడే తనిఖీలు జరిగితే ప్రమాదం జరిగి ఉండేది కాదని

  విష్ణువర్ధన్ హిమయత్ నగర్‌లో ఉంటాడని తెలుస్తోంది. ఆయన ఇటీవలి వరకు దుబాయ్‌లో ఉండి వచ్చారని సమాచారం. ఆ తర్వాత ఇక్కడే ఉంటున్నారు. పోలీసులు రాత్రి ఒంటి గంట వరకు ప్రమాదం జరిగిన పాయింట్ వద్ద తనిఖీలు చేశారు. ఆ తర్వాత మరో ప్రాంతానికి చెక్ పాయింటు మార్చారు. ప్రమాదం ఆ తర్వాత కాసేపటికే జరిగింది. అదే ప్రాంతంలో తనిఖీలు కొనసాగి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు.

  కళ్లు మూసి తెరిచేలోపు

  కళ్లు మూసి తెరిచేలోపు

  విష్ణు దుబాయ్‌లో ఇంజినీరింగ్ చేశాడని సమాచారం. భార్య డాక్టర్‌గా పని చేస్తున్నారని, తల్లి లాయర్ అని తెలుస్తోంది. విష్ణు హిమయత్ నగర్‌లో ప్లే స్కూల్ నిర్వహిస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తు, నిద్రమత్తులో విష్ణు కొన్ని క్షణాలు కళ్లు మూసుకున్నాడని, ఆయన కళ్లు మూసి తెరిచేలోపు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Woman killed in road accident in midnight in Hyderabad.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి