అడ్డు అని: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్: ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసింది.

పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. హైదరాబాదులోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీఐ వాసు వివరించారు.

ఏప్రిల్‌ 29న గోపన్‌పల్లి చిన్నచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు.

Woman kills husband with the help of lover

రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన మంగళి వెంకటేష్‌(35), బతుకుదెరువు కోసం భార్య రాధ, పిల్లలతో కలిసి నగరంలోని శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో నివాసం ఉంటున్నారు.

వెంకటేష్‌ కూలీకాగా, రాధ గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీలో హౌస్‌కిపింగ్‌గా పనిచేస్తోంది. రోజూ ఆటోలో డీఎల్‌ఎఫ్‌కు వెళ్లే సమయంలో గోపన్‌పల్లికి చెందిన, వడ్డెర పనిచేసే శ్రీనుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

తమకు భర్త అడ్డొస్తున్నాడని, భర్తను హతమార్చాలని, ప్రియుడితో కలిసి భార్య పథక రచన చేసింది. శ్రీను స్నేహితుడు రమేష్‌ ఆటోడ్రైవర్‌. ఏప్రిల్‌ 29న రాత్రి రాధ ఇంటికి ఇద్దరు స్నేహితులు వెళ్లారు. చున్నీతో వెంకటేష్‌ను గొంతునులిమి హత్యచేశారు.

గుట్టురట్టుకాకుండా రమేష్‌, శ్రీనులు వెంకటేష్‌ మృతదేహానికి బండరాళ్లను కట్టి గోపన్‌పల్లిలో ఉన్న చిన్నచెరువులో పడవేశారు. పత్రికల్లో ఫొటోలను చూసి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.

మృతుని భార్య ఏప్రిల్‌ 29నుంచి ఇళ్లు ఖాళీ చేసి పరారయింది. భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. ఆటోను స్వాధీనంచేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+