దారుణం: ఆటోలో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా ముగ్గురు గ్యాంగ్‌రేప్

నగరంలో గత శుక్రవారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..

హైదరాబాద్: నగరంలో గత శుక్రవారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళపై ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. జియాగూడలో నివాసముండే 30 సంవత్సరాల ఓ మహిళ గత శుక్రవారం రాజేంద్రనగర్‌లో నివాసముండే బంధువుల ఇంటికి వచ్చింది. రాజేంద్రనగర్‌లో కల్లు తాగిన ఆ మహిళ రాత్రి 8 గంటలకు బస్సు కోసం నిలబడింది. ఆ సమయంలో వచ్చిన ప్యాసింజర్‌ ఆటోలో ఎక్కింది.

Woman passenger gangraped by two with a auto drivers in Hyderabad

అప్పటికే డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు అందులో ఉన్నారు. ఆమె మొగల్‌కా నాలా చౌరస్తా వరకు వెళ్లాలని ఎక్కింది. ఆటోను అత్తాపూర్‌ వైపు కాకుండా చింతల్‌మెట్‌ వైపు తీసుకెళ్లారు. తాను వెళ్లాల్సింది అత్తాపూర్‌ వైపు కదా? అని మహిళ ప్రశ్నిస్తే.. ఇక్కడ్నుంచి దగ్గర అవుతుందని ఆ మహిళకు చెప్పి చింతల్‌మెట్‌ కొండలపై ఒక గదిలోకి తీసుకెళ్లారు.

ఆ తర్వాత అక్కడే మహిళపై ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమో దు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+