మినీ స్టేడియంలో గుర్తు తెలియని మహిళపై రేప్, హత్య
రంగారెడ్డి/ మెదక్: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం జరిపిన గుర్తుతెలియని దుండగులు ఆపై ఆమెను హతమార్చారు. ఈ ఘోర ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి మినీ స్టేడియం వద్ద చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలావుంటే, మెదక్ జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని ఫార్మా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా అస్వస్థకు గురైన ఇద్దరు కార్మికుల్లో ఒకరు మృతిచెందారు. రియాక్టర్‌కు మరమ్మతులు చేస్తుండగా రసాయనాలు వెలువడ్డాయి. ఈ రసాయనాల ప్రభావంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు.
పరిస్థితి విషమించిన ఆపరేటర్ నాగేశ్వర్‌రావును గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఆపరేటర్ ఏడుకొండలుకు బాలానగర్ బీబీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications