కిడ్నాప్ ట్విస్ట్: ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించిన భార్య ఈమే (పిక్చర్స్)

హైదరాబాద్: సంచలనం సృష్టించన వివాహిత రాధిక అలియాస్ అరుణ జ్యోతి అపహరణ ఉదంతాన్ని పోలీసులు ఛేదించారు. రాజేంద్ర నగర్ ఉప్పరపల్లికి చెందిన ఆమె తన ఇష్టంతోనే ప్రియుడితో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. తెచ్చుకున్న డబ్బు అయిపోవడంతో భర్త నుంచి సొమ్ము లాగేందుకు అపహరణ నాటకం ఆడినట్లు నిర్ధారించారు.

గుర్తు తెలియని వ్యక్తులు తనను బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు కొన్ని దృశ్యాలను వాట్సప్ ద్వారా పంపించడం రాధిక అల్లిన కట్టుకథగా శంషాబాద్ డిసిబి ఏఆర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆరేళ్ల కూతురున్న రాధికకు 2011లో ప్లేటాక్ సామాజిక మాధ్యమం ద్వారా రిజ్వాన్ (20)తో పరిచయమైంది.

బీహార్‌కు చెందిన ఇతను ఖైరతాబాదులోని ఎంఎస్ మక్తాలో ఉంటూ ఓ హోటల్లో పని చేసేవాడు. తనకంటే అందంగా ఉండే స్నేహితుడైన ఎతేషాం చిత్రాన్ని రిజ్వాన్ తన ప్రొఫైల్ ఫోటోగా పెట్టాడు, అది చూసి ఆకర్షణ పెంచుకన్న రాధిక అతనితో చాటింగ్ చేసింది. మధ్యలో ఆపినా 2013 మళ్లీ చాటింగ్ ప్రారంభం చేశారు.

 కిడ్నాప్ డ్రామా

కిడ్నాప్ డ్రామా

తమ వెంట తెచ్చుకున్న రూ.20వేలు అయిపోవడంతో.... రిజ్వాన్ రాధిక భర్త మహేశ్‌కు ఫోన్ చేశాడు. నీ భార్యను కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షలు పంపించాలని డిమాండ్ చేశాడు. ఖాతా నెంబర్ సైతం వాట్సాప్ ద్వారా మేసెజ్ పంపించాడు. దీంతో మహేశ్ రెండు సార్లు అందులో రూ.పది వేలు వేశాడు.

 కిడ్నాప్ డ్రామా

కిడ్నాప్ డ్రామా

ఆ డబ్బులు డ్రా చేసుకొని ఇద్దరు కలిసి అదే రోజు ఒడిశా రాష్ట్రం కటక్‌కు వెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలో బస చేశారు. అనంతరం రాధికకు బురఖా ధరింపజేసి చేతులు వెనక్కి కట్టెసి నోట్లో గుడ్డ పెట్టి చిత్రహింసలకు రక్తం కారుతున్నట్లు ఫొటో తీసి వాట్సాప్ ద్వారా మళ్లీ మహేశ్‌కు పంపించాడు.

 కిడ్నాప్ డ్రామా

కిడ్నాప్ డ్రామా

నేనడిగిన డబ్బులు పంపించకుంటే నీ భార్యను చంపేస్తానని బెదిరించాడు. అనంతరం కోల్‌కతాలోని మల్లిక్‌పూర్ కాలనీలో ఉండే రిజ్వాన్ సోదరుడికి ఇంటికి వెళ్లారు. బాధితుడు మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ ప్రత్యేక పోలీసుల బృందం సెల్ సిగ్నళ్ల ఆధారంగా కోల్‌కత్తాలో రాధిక, మహ్మద్ రిజ్వాన్‌లను అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు.

 కిడ్నాప్ డ్రామా

కిడ్నాప్ డ్రామా

ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా, తన భర్త తరచుగా అనుమానంతో చిత్రహింసలు పెట్టడం వల్లే రిజ్వాన్‌ను పెళ్లి చేసుకునేందుకు వెళ్లినట్లు రాధిక తెలిపింది. నెట్ చాటింగ్ ద్వారా దగ్గరయ్యామని రిజ్వాన్ తెలిపాడు.

వాట్సప్, ఫోన్, ఇతర మాధ్యమాల ద్వారా మాట్లాడుకునే వారు. అది ప్రేమకు దారి తీసింది. తనకు ఇదివరకే పెళ్లై ఓ కూతురు ఉన్నట్లు రాధిక గానీ, ప్రొఫైల్ ఫోటో తనది కాదని రిజ్వాన్ గానీ చెప్పలేదు. పరస్పరం మోసపుచ్చుకున్నారు.

ఓసారి రిజ్వాన్‌తో ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ తెలుసుకొన్న ఆమె భర్త మహేశ్ హెచ్చరించి వదిలేశాడు. అయినా ఆమె అతడితో మాట్లాడుతుండేది. ఇద్దరు కలిసి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న అత్తాపూర్‌లోని కాలహనుమాన్ ఆలయ వద్ద మొదటిసారి కలుసుకున్నారు.

ఎతేషాం అంత అందంగా రిజ్వాన్ లేకపోవడంతో రాధిక కంగుతింది. అయినా అతనితో వెళ్లిపోయేందుకు సిద్ధమాంది. తొలుత ఖైరతాబాదులోని రిజ్వాన్ గదికి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు ఒడిశాలోని కటక్ వెళ్లారు. అదేరోజు రాధిక భర్త మహేష్ ఫిర్యాదుతో రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+