లేడీ టెక్కీ ఆత్మహత్య: భార్యతో గొడవపడి చిత్తుగా తాగేసి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: గుండెనొప్పి తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజయ్య ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రంగ సంధ్య(28) కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్ ఈడబ్ల్యూఎస్-919లో తల్లి ఉమారాణితో కలిసి ఉంటోంది.

హైటెక్‌సిటీలోని ఓసాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న సంధ్య బుధవారం విధులకు హాజరుకాకుండా ఇంట్లోనే ఉండిపోయింది. గదిలోకి వెళ్లిన సంధ్య పిలిచినా పలకకపోవడంతో తల్లి ఉమారాణి చుట్టపక్కల వారికి, పోలీసులు సమాచారమిచ్చింది.

గది డోర్ తెరచి చూడగా సంధ్య చున్నీతో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అక్కడ దొరికిన సూసైడ్ నోట్‌లో గుండెలో నొప్పిగా ఉందని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. ఈ మేరకు కేసును దర్యాప్తు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

చిత్తుగా తాగేసి ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య

Woman techie commits suicide in Hyderabad

ఇదిలావుంటే, భార్యపై గొడవపడిన ఓ వ్యక్తి మద్యం తాగి మంచినీటి ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేంద్రనాథ్ సంఘటన వివరాలను అందించారు.

మీనా, వెంకటేశ్(32) దంపతులు లక్ష్మిగూడ రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. వెంకటేశ్ పాతపేపర్ వ్యాపారం చేస్తుండగా మీనా ఇంటి వద్దనే ఉంటుంది. వీరిద్దరూకొన్ని రోజులుగా ఘర్షణ పడుతున్నారు.

మరోసారి బుధవారం గొడవపడింది. మధ్యాహ్నం వెంకటేశ్ చిత్తుగా మద్యం తాగి గృహకల్ప సముదాయాల్లో ఉన్న మంచినీటి ట్యాంక్ ఎక్కి పై నుంచి కిందకు దూకాడు. అతని తలకు తీవ్రగాయాలు కావడంతో అసుపత్రికి తీసుకెళ్ళేలోపే చనిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు.

యువకుడి ఆత్మహత్య

కొత్తపేట పాత గ్రామానికి చెందిన జీహెచ్‌ఎంసీ శానిటేషన్ కాంట్రాక్ట్ లేబర్ భాగ్యమ్మ కుమారుడైన నవీన్‌కుమార్ (26) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం తల్లి భాగ్యమ్మ పని కోసం నాగోలుకు వెళ్లింది. అమ్మమ్మను ఇడ్లీ తిని రావాలంటూ పంపించిన నవీన్‌కుమార్ తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.

తిరిగి వచ్చిన ఆమె ఎంతకూ తలుపులు తీయకపోవడంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు తెరిచే సరికి నవీన్‌కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. అతను అఘాయిత్యం చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

కాగా, మృతుడు నవీన్‌కుమార్ జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ వద్ద పీఏగా పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న నవీన్‌కుమార్ మృతదేహాన్ని జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమీషనర్ నవీన్‌మిట్టల్ ఉస్మానియా ఆస్పత్రిలో సందర్శించారు. మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+