రైలుకు ఎదురెళ్లిన యువతి, హఠాత్తుగా నిలిపేసిన డ్రైవర్, అందుకే సాధ్యమైంది
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో రైలు డ్రైవర్ అప్రమత్తతతో ఓ యువతి ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘటన కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా వచ్చింది. అయితే ఆమె ఎదురుగా ఉండటాన్ని గ్రహించిన రైలు డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు.

కుటుంబంలోని గొడవల కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో రైలుకు ఎదురుగా వచ్చి నిలబడింది.
ఆమె ఎర్రటి రంగు దుస్తులు ధరించి ఉండటం, రైలు వేగం చాలా తక్కువగా ఉంటంతో డ్రైవర్ దానిని నిలిపివేసేందుకు అవకాశం లభించింది. రైలు హఠాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణీకులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తర్వాత యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications