వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెంట్ లేకుండానే బల్బులు వెలుగుతున్నాయి.. కేవలం ఒంటికి తగిలిస్తే చాలు!! అదిలాబాద్‌లో వింత.. !

|
Google Oneindia TeluguNews

Recommended Video

బల్బులు వెలుగుతున్నాయి.. కరెంట్‌తో కాదు.. ఒంటితో..!! (వీడియో)

ఆదిలాబాద్ జిల్లా బెలా మండలం సిర్సన్న గ్రామంలో వింత చోటుచేసుకుంది. వింత అంటే మమూలు వింత కాదు. గ్రామంలోని రాంనగర్‌లో ఎస్కే చాంద్ ఉంటున్నారు. అతనికి భార్య, కుమారుడు సమీర్, కూతురు సానియా ఉన్నారు. అయితే ఒకరోజు అనుకోకుండా పిల్లలు బల్బును తాకడంతో అదీ వెలిగింది. దీంతో తండ్రి చాంద్ పాష కూడా ముట్టుకొని చూశాడు. అయితే వారు ముగ్గురు బల్బ్‌ని తాకితే వెలుగుతుంది. కానీ చాంద్ భార్య పట్టుకుంటే వెలగడం లేదు. అయితే ఈ విషయం ఊరిలో అందరికీ తెలిసింది.

వింత

వింత

ఆదిలాబాద్ జిల్లా బెలా మండలం సిర్సన్న గ్రామంలో వింత చోటుచేసుకుంది. వింత అంటే మమూలు వింత కాదు. గ్రామంలోని రాంనగర్‌లో ఎస్కే చాంద్ ఉంటున్నారు. అతనికి భార్య, కుమారుడు సమీర్, కూతురు సానియా ఉన్నారు. అయితే ఒకరోజు అనుకోకుండా పిల్లలు బల్బును తాకడంతో అదీ వెలిగింది. దీంతో తండ్రి చాంద్ పాష కూడా ముట్టుకొని చూశాడు. అయితే వారు ముగ్గురు బల్బ్‌ని తాకితే వెలుగుతుంది. కానీ చాంద్ భార్య పట్టుకుంటే వెలగడం లేదు. అయితే ఈ విషయం ఊరిలో అందరికీ తెలిసింది. ఇంకేముంది వారి ముందుకూడా చాంద్, అతని కుమారుడు బల్బ్‌ను పట్టుకున్నారు. విద్యుత్ వెలుగులు వెలిగాయి. అయితే అక్కడే ఉన్న ఓ ఔత్సాహికుడు కూడా ముట్టుకొని ట్రై చేశాడు. కానీ అతని ఆశ అడియాసే అయ్యింది. బల్బ్ వెలగలేదు.

ముట్టుకుంటే వెలుగులు

ముట్టుకుంటే వెలుగులు

చాంద్ బల్బ్ ముట్టుకోకుండా తీసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ ట్రోల్ అవుతుంది. నెటిజన్లు కూడా విభిన్న కామెంట్లు పెడుతున్నారు. చాంద్, అతని కుమారుడు, కూతురిలో పవర్ ఉందా అనే చర్చకు దారితీసింది. మిగతా వారికి రానిది .. వారికి ఎందుకొస్తుంది అనే చర్చ జరుగుతుంది. అయితే దీనిపై శాస్త్రవేత్తలు, వైద్యులు స్పందించాల్సి ఉంది. వైదపరంగా, సాంకేతికంగా ఇలా ఏమైనా జరుగుతుందా అనే అంశంపై వారు క్లారిటీ ఇవ్వాలి. లేదంటే చాంద్‌ ఫ్యామిలీ టచ్ చేస్తే ఎందుకు బల్బ్ వెలుగుతుందో అనే అంశానికి సమాధానం లేకుండా పోతోంది. చంద్రమండలానికి రాకెట్ పంపిస్తోన్న ఈ రోజుల్లో బల్బ్ విషయం కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు. కానీ ఆ మేరకు అడుగులు పడాల్సిన అవసరం మాత్రం ఉంది.

 అదేంటి అలా

అదేంటి అలా

మరోవైపు గ్రామస్తులు మాత్రం నోరేళ్లబెడుతున్నారు. ఏంటీ చాంద్ .. ఏ మయ, మంత్రం చేస్తున్నావా అని ఆట పట్టిస్తున్నారు. మీ కుటుంబానకి ఎందుకీలా జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఏదో మర్మం దాగి ఉందని అనుమానిస్తున్నారు. లేదంటే ఊరిలో ఇంత మంది ఉంటే మీకే ఎందుకీలా అని అడుగుతున్నారు. అయితే అతని భార్య ముట్టుకుంటే ఎందుకు రావడం లేదని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అందరికీ బల్బ్ వెలిగితే బాగోదు అనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారా అని మరికొందరు అంటున్నారు. అయితే చాంద్, అతని కుమారుడు, కూతురు నుంచి మాత్రం బల్బ్ వెలగడం నిజం. ఇందులో మర్మమెంటో అన్న అంశాన్ని తేల్చాల్సింది మాత్రం నిపుణులే.

English summary
The Bela Mandalam of Adilabad district has taken a strange place in Sirsaanna village. Chand is staying in Ramnagar in the village. He is survived by wife, son Sameer and daughter Sania. One day, however, it was lit when the children accidentally touched the bulb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X