వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచబ్యాంక్ 13వ ర్యాంక్ చిచ్చు: ఆశ్చర్యంలేని బిజెపి, తలా తోక లేకుండా..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల జాబితా రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. ఈ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్స్ తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి!

ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 13వ స్థానంలో నిలవడంపై టిఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. టాప్ స్థానాల్లో బిజెపి పాలిత రాష్ట్రాలో ఉన్నాయని ఆరోపించారు.

అయితే, దానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాటల్లో సమాధానం కూడా లభించింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ఎన్డీయే ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం అన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ప్రధాని మోడీ నాడు.. సీఎంగా అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారు. గుజరాత్‌ను అభివృద్ధి చేశారనే ప్రశంసలు అందుకున్నారు.

అయితే, టిఆర్ఎస్ నేతలు మాత్రం.. తెలంగాణకు 13వ ర్యాంక్ రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెరాస ఆక్షేపించింది.

World Bank's state business rankings: Different statements in Telangana parties

ప్రపంచ బ్యాంకు రాష్ట్రాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ఎంతో అనువైన రాష్ట్రమన్నారు. ఈ విషయాన్ని విస్మరించి 13వ ర్యాంక్ ఆక్షేపణీయమన్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. వాటిని తాము పట్టించుకోమన్నారు.

మరో అడుగు ముందుకేసి.. నమస్తే తెలంగాణలో ఈ రోజు ఓ కథనం వచ్చింది. ప్రపంచ బ్యాంకు పేరిట తెరపైకి వచ్చిన సర్వే నివేదిక బాధ్యత తమది కాదంటే తమది కాదని అంతా చేతులు దులిపేసుకుంటున్నారని, బయటి సంస్థలు అందించిన సమాచారంతో రూపొందినందున ఈ నివేదికలోని అంశాలతో తమకు బాధ్యత లేదని, వీటిని తమ అభిప్రాయాలుగా భావించరాదని, ఇందులోని అంశాల కచ్చితత్వంపై ఎలాంటి గ్యారెంటీ ఇవ్వబోమని ప్రపంచ బ్యాంకు ప్రకటించిందని పేర్కొంది.

తెలంగాణకు 13వ ర్యాంక్‌పై తెలంగాణ బిజెపి స్పందన

ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పెట్టుబడుల సానుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి 13వ ర్యాంక్ రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని తెలంగాణ బిజెపి చెప్పింది. ప్రభుత్వం అసమర్థత వల్లే రాష్ట్రం వెనుకబడిందని ధ్వజమెత్తారు. తలా, తోక లేని నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుతో మొట్టికాయలు కూడా వేయించుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రతి విషయంలో అసమర్థత కనిపిస్తోందన్నారు.

English summary
World Bank's state business rankings: Different statements in Telangana parties
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X