ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం
హైదరాబాద్: గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత్స్య కారులను గుర్తించలేదని రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో జరిగిన ప్రపంచ మత్స్య కారుల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజెందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ సూచించారు. ఎక్కడ నీటి వనరులు ఉన్న వాటి మీద హక్కు మత్స్య కారులకు ఇవ్వాలన్నదే కెసిఆర్ ఆలోచన అని అయన అన్నారు.












Click it and Unblock the Notifications