కరోనా రోగి మృతదేహం మారింది, శ్మశానంలో గుర్తించిన భార్య, అంబులెన్స్‌లో తిరిగి గాంధీకి...
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 నోడల్ ఆస్పత్రిగా గాంధీ దవాఖాన పనిచేస్తుంది. వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి ఉంది. దీంతో మంగళవారం చనిపోయిన ఓ రోగికి బదులు మరో రోగి శవాన్ని బంధువులకు అప్పగించారు. అక్కడినుంచి శ్మశానం తీసుకెళ్లాక.. మొహాం చూసి గుర్తించారు. వెంటనే అంబులెన్స్‌లో గాంధీ మార్చురీకి చేరుకున్నారు. అయితే అక్కడ వారికి కావాల్సిన శవం ఉండటంతో శాంతించారు.
హైదరాబాద్ బేగంపేట గురుమూర్తినగర్‌కి చెందిన ఓ రోగి మంగళవారం గాంధీ ఆస్పత్రిలో చనిపోయారు. తర్వాత ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అక్కడినుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆయన భార్య మృతదేహాన్ని గుర్తించారు. శవం తన భర్తది కాదని చెప్పడంతో... అదే అంబులెన్స్‌లో తిరిగి గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

అక్కడ వైద్యులు, సిబ్బందితో గొడవపడ్డారు. మృతదేహాం ఎలా మార్చారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మార్చురీలో వారికి కావాల్సిన మృతదేహం కనిపించింది. దీంతో వారు శాంతించారు. వాస్తవానికి గాంధీలో కరోనా వైరస్ సోకిన రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. దీంతో వైద్యులు, సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. దీంతో మృతదేహాం మారింది. మరోవైపు బుధవారం వారికి సరైన మృతదేహాం ఇవ్వడంతో తీసుకెళ్లి.. అంత్యక్రియలు నిర్వహించిట్టు తెలిసింది.
Recommended Video
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications