మునుగోడు ఓటర్లకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి స్పెషల్ దర్శనం; వివాదంగా మారిన వ్యవహారం!!
మునుగోడులో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం రాజకీయ పార్టీల నాయకులు చెయ్యని పని లేదు. ముఖ్యంగా మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంలో టిఆర్ఎస్ పార్టీ ముందువరుసలో ఉంది అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో మంత్రులు, ఎమ్మెల్యేల ను రంగంలోకి దింపి మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని మొదలు పెట్టింది. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ పరిధిలో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడం కోసం, ఓటర్ లతో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించడం కోసం నానా తంటాలు పడుతున్నారు.

మునుగోడు ఓటర్లకు లక్ష్మీ నరసింహ స్వామివారి స్పెషల్ దర్శనం
ఇక అందులో భాగంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న పనులు అనేక వివాదాలకు కారణంగా మారుతున్నాయి. తాజాగా యాదగిరిగుట్టలో మునుగోడు ఓటర్ల స్పెషల్ దర్శనం వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఓటర్లను యాదగిరిగుట్టకి తీసుకెళ్లిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వామివారి ఆరగింపు సేవను నిలిపివేయించి మరీ మునుగోడు ఓటర్లకు స్వామివారి స్పెషల్ దర్శనం చేయించారు. ఇక దీనిపై విమర్శలు వెల్లువ గా మారాయి.

15 బస్సుల్లో యాదాద్రికి మునుగోడు ఓటర్లు.. ఆరగింపు సేవ ఆపి మరీ స్వామి దర్శనం
ఈరోజు ఉదయం 15 బస్సులలో మునుగోడు నియోజకవర్గం లోని దండు మల్కాపురం గ్రామానికి చెందిన ఓటర్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యాదగిరిగుట్ట కు తీసుకువెళ్లారు. మునుగోడు నుంచి వెళ్లే బస్సులకు 9999 ఫార్చునర్ కారు ఎస్కార్ట్ గా వెళ్ళింది. ఇక ఆ బస్సులను అధికారులు నేరుగా కొండపైకి అనుమతించారు.గుట్ట పైకి వారి చేరుకునే సరికి 12 గంటలు అయింది. అయితే 12 గంటల సమయంలో స్వామివారి ఆరగింపు సేవ జరగాల్సి ఉండగా, ఎమ్మెల్యే సూచనలతో అధికారులు దానిని నిలిపివేసి దండు మల్కాపురం ఓటర్లకు కుటుంబసమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించారు. గ్రామస్తులు అందరికీ 150 రూపాయల స్పెషల్ దర్శనాన్ని చేయించారు.

ఆరగింపు సేవ ఆపటంపై విమర్శలు
ఇక దీంతో స్వామివారి సేవలు నిలిపివేసి ఓటర్లకు దర్శనం చేయించడం విమర్శలకు కారణంగా మారింది. ఆలయానికి సంబంధించిన నియమాలను, రాజకీయ నాయకుల కోసం ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక దండు మల్కాపురం గ్రామస్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అనంతరం నలభై మేకలు కోసి మరీ విందు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. దండు మల్కాపురం ఓటర్లను తమవైపుకు తిప్పుకోవటం కోసం ఈ తరహా చర్యలకు దిగుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

యాదాద్రి ఆలయ అధికారులు స్పందిస్తారా?
స్వయంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమని యాదగిరిగుట్టకు తీసుకువచ్చారని దర్శనానికి వచ్చిన గ్రామస్థులు చెప్తున్నారు. ఏ కొందరైతే మునుగోడు ఉపఎన్నిక పుణ్యమాని స్వామివారిని చక్కగా దర్శనం చేసుకున్నామని చెబుతున్నారు. స్వామి దర్శనం కోసం ఆలయానికి తీసుకెళ్లడం తప్పు కాకున్నా, మునుగోడు ఓటర్లకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించడానికి స్వామివారి ఆరగింపు సేవను నిలిపి వేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే అంటున్నారు ఈ విషయం తెలిసిన కొందరు. మరి ఈ వ్యవహారంలో యాదాద్రి ఆలయ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications