వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాదుడు షురూ: యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500

|
Google Oneindia TeluguNews

నల్గొండ: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వాహనాల్లో వెళ్లే భక్తులకు ఇది కొంత నిరాశకు గురిచేసేదే. ఎందుకంటే, ఇక నుంచి యాదాద్రి కొండపైకి అనుమతించే వాహనాలకు పార్కింగ్‌ రుసుం భారీగా వసూలు చేయనున్నారు. కొండపైకి అనుమతించే వాహనాలకు గంటకు రూ.500 రుసుం విధించనున్నారు.

అంతేగాక, ఆ గంట సమయం తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రోటోకాల్‌, దాతల వాహనాలకు ప్రవేశ రుసుం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆదివారం(మే1) నుంచి వాహనాలకు నిర్ణయించిన ప్రవేశ రుసుం అమలు అవుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు. అయితే, పార్కింగ్ రుసుం భారీగా ఉండటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Yadadri temple vehicle Parking Fee Rs 500

కాగా, యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలపై యాదాద్రి దేవస్థానం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి ఇదివరకే వెల్లడించారు. కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తుల తరలించనున్నట్లు తెలిపారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయం ఆలయమే భరిస్తుందని ఈవో చెప్పారు. అయితే తాజా నిర్ణయంతో వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నుంచే నూతన ఆలయంలోకి భక్తుల సందర్శనకు అనుమతిస్తున్నారు. అద్భుతంగా నిర్మాణం జరిగిన ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు

English summary
Yadadri temple vehicle Parking Fee Rs 500.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X