Year ender 2023: ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్, ఏపీ, తెలంగాణ ఏ స్థానంలోనంటే?
2023 ఏడాదికి గానూ ఓయో (Oyo) బుక్సింగ్‌లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ఫ్లాట్‌ఫాం ఓయో ట్రావెలోపీడీయా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.
ఓయో తన నివేదికలో నగరాలు, రాష్ట్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వారీగా ర్యాంకులను పొందుపర్చింది. ఈ ఏడాది అత్యధిక బుకింగ్స్ నమోదైన నగరంగా హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచిందని ఓయో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాలు నిలిచాయి. గోరఖ్‌పూర్, దిఘా, వరంగల్, గుంటూరు వంటి నగరాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన వృద్ధిని సాధించాయని ఓయో నివేదిక పేర్కొంది.

ఖాళీ సమయాల్లో ఎక్కువ మంది సందర్శించిన ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గోవా, మైసూర్, పుదుచ్చేరి నిలిచాయి. ఇక ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరీ అగ్రస్థానంలో నిలిచింది. అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువగ ప్రచారంలో లేని దేవ్‌గఢ్, పళని, గోవర్ధన్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా గతం కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.
ఈ నివేదికలో రాష్ట్రాలవారీగా చూస్తే .. ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలిచాయని ఓయో నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ తర్వాత దాదాపు పర్యాటక రంగం సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఓయో తెలిపింది.

కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత కొత్త ప్రదేశాల సందర్శన పెరిగిందని.. ఈ ట్రెండ్ 2023లో కొనసాగిందని ఓయో నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 30న అత్యధిక బుకింగ్స్ నమోదు కాగా.. అత్యధికంగా బుకింగ్స్ నమోదైన నెల మాత్రం మే నిలిచిందని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications