Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2025 తెలంగాణాలో ఆ పార్టీకి పరీక్షా కాలం.. అడుగడుగునా వైఫల్యాల కాలం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత బిఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోయిందా? 2025 సంవత్సరం బిఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డు కాలంగా మిగిలిందా? 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ప్రజలలోకి వెళ్లడంలో సక్సెస్ కాలేక పోయిందా? బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్ళలేకపోయారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమి చూసిన బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీ గత ఎన్నికలలో చావు దెబ్బతింది అయితే ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాల్సిన పార్టీ 2025 సంవత్సరంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంది. 2025 లో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘోర ఓటమిని చూసింది. రాజకీయంగా కొత్త పరిస్థితులకు అలవాటు పడవలసి వచ్చింది.

year ender 2025 BRS After Defeat Political Struggles and Challenges in 2025

Take a Poll

పార్టీలో ముసలం.. కవిత సస్పెన్షన్..
అంతకుముందు అజేయంగా ఉన్నబీఆర్ఎస్ పార్టీ 2025 లో దాదాపు ఎక్కువగా పరాజయాలను చూసింది. 2025 సంవత్సరంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ వెనుకబడింది. మరోవైపు పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత వ్యవహార శైలి కూడా పార్టీకి నష్టం చేసింది. కవిత పదేపదే పార్టీలో హరీష్ రావును, సంతోష్ తదితరులను టార్గెట్ చేసే విమర్శలు చేయడం వంటి చర్యలకు పాల్పడడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

పాదయాత్రలతో కవిత దెబ్బ, ప్రజా సమస్యలపై పోరాటంలోనూ వెనుకబాటు
కవిత పై తీసుకున్న నిర్ణయం కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడమే అజెండాగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలు చేస్తూ అవకాశాన్ని బట్టి బి ఆర్ ఎస్ పై నేతలను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో ప్రజాసమస్యల పట్ల పెద్దగా పోరాటం కూడా బీఆర్ఎస్ చేయలేకపోయింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో కూడా విఫలమైంది.

ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్
2025లో జిల్లా, మండల స్థాయిలో కూడా పార్టీ యంత్రాంగం బలహీన పడింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన పోరాటం చేయాల్సిన బీ ఆర్ ఎస్ ప్రజాక్షేత్రంలో ఎటువంటి ఉద్యమాలు చేపట్టలేక పోవడం బీ ఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఇక కెసిఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకుండా ఫాం హౌస్ కే పరిమితమై అజ్ఞాతంలో ఉండడం కూడా పార్టీకి తీరని నష్టం చేస్తుంది.

పరీక్షా కాలం ఎదుర్కొన్న బీఆర్ఎస్.. 2026 ఎలా ఉంటుందో
కేటీఆర్ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు అన్న అభిప్రాయం 2025 సంవత్సరంలో వ్యక్తమైంది. రాజకీయంగా ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి పరీక్ష కాలంగా గడ్డు కాలంగా చెప్పవచ్చు. మరి రానున్న సంవత్సరంలోనైనా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా? ప్రతిపక్ష పార్టీగా, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలకు కనిపిస్తుందా? అనేది భవిష్యత్తులో తేలనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+