Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘‘చెల్లెలిపై కన్నేశాడని బుద్ధి చెప్పి పంపించమంటే.. ఏకంగా చంపేసి శవం అప్పగించారు’’

నగరంలోని బేగంపేట పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో శుక్రవారం రాత్రి మోహన్ కృష్ణ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: నగరంలోని బేగంపేట పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకే అతడు మరణించినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోహన్ కృష్ణ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నగరంలోనే నివసిస్తున్నాడు. ఇతడు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య లావణ్య, ఒక బాబు ఉన్నారు.

అయితే మోహన్ కృష్ణ కొన్ని రోజులుగా లావణ్యకు వరుసకు సోదరి అయ్యే ఓ బాలిక వెంట పడుతున్నాడు. ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. తన భర్త తన చెల్లెలితో సన్నిహితంగా ఉండడం గమనించిన లావణ్య భర్తను నిలదీసింది. దీంతో అతడు ఆమె చెల్లెలిని కూడా పెళ్లిచేసుకుంటానని సమాధానమిచ్చాడు.

లావణ్య వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. మోహన్ కృష్ణ ఆలోచన తప్పు అంటూ అటు అతడి తల్లిదండ్రులు, ఇటు అత్తమామలు చెప్పినా అతడు వినిపించుకోలేదు. లావణ్య చెల్లెలిని పెళ్లి చేసుకుంటానంటూ మంకుపట్టు పట్టాడు.

Young Man Suspicious Death in Begumpet Police Station

దీంతో మోహన్ పై అతడి భార్య లావణ్య, ఆమె తల్లిదండ్రులు బేగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మోహన్ కృష్ణని మందలించి పంపమని వేడుకున్నారు. దీంతో పోలీసులు అతడిని శుక్రవారం సాయంత్రం లాకప్ లో పెట్టారు. అతడి కుటుంబ సభ్యులను, లావణ్య చెల్లెల్ని కూడా స్టేషన్ కు పలిపించారు.

వారి కళ్ల ఎదుటే అతడ్ని ఆ బాలికతో చెప్పుతో కొట్టించారు. అనంతరం వారిని వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ తరువాత అర్థరాత్రి సమయంలో పోలీసుల నుంచి మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. అతడి ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చేర్చామని చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు.

దీంతో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే అతడు మరణించాడంటూ అతడి బంధువులు శుక్రవరం అర్థరాత్రి ప్రాంతంలో బేగంపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడించి ధర్నాకు దిగారు. అతడి భార్య లావణ్య మీడియాతో మాట్లాడుతూ తన భర్త చెడు దారిలో వెళుతున్నాడని మందలించి పంపమనే తాను పోలీసులను కోరానని, కానీ ఇలా కొట్టి చంపేస్తారని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మృతుడు మోహన్ కృష్ణ తల్లి రేణుక మాట్లాడుతూ తన కొడుకును టైరు ముక్కతో ఉన్న బ్యాటుతో రెండు గంటల పాటు కొట్టారని, ఆ దెబ్బలు తట్టుకోలేకే మరణించాడని, చనిపోయిన తరువాత శవాన్ని తమకు అప్పజెప్పారంటూ పేర్కొంది.

అయితే దీనిపై బేగంపేట పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ జగన్ మాట్లాడుతూ.. మోహన్ కృష్ణ రెండ్రోజుల నుంచి అన్నం తినకపోవడం వల్ల బాగా నీరసించి పోయాడని, తాము ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పేర్కన్నారు.

అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయని, ఒక వేళ పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే అతడు మరణించినట్లు తేలితే అందుకు కారణమైన పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+