ప్రియుడి బొమ్మగీసి, ప్రశ్నగా మిగిలిపోయానంటూ.. కంటతడి పెట్టించే సూసైడ్ నోట్; ప్రియురాలు ఆత్మహత్య

అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పెళ్లికి గడువును కూడా పెట్టుకున్నారు. కానీ పెద్ద మనుషులు పెట్టిన గడువు ముగిసినా, పెళ్లి చేసుకుంటా అన్న యువకుడు పెళ్లికి సుముఖత చూపించలేదు. దీంతో తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, వారికి సమాధానం చెప్పలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడి రూపాన్ని బొమ్మ గీసి మరీ సూసైడ్ చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..

పెళ్ళికి ఆరు నెలల గడువు కోరిన ప్రియుడు

పెళ్ళికి ఆరు నెలల గడువు కోరిన ప్రియుడు


మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన అమ్మాయి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలలోనూ పెద్దలకు తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అబ్బాయి తరపు వాళ్లు వాళ్ళిద్దరి వివాహానికి 6నెలలు గడువు కోరారు. ఆరు నెలలు గడువు ముగిసిన అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకుంటాడో లేదో అన్న ఆందోళన అమ్మాయి తల్లిదండ్రుల్లో వ్యక్తమైంది.

 పెళ్ళికి మళ్ళీ గడువు కావాలన్న ప్రియుడి తీరుతో యువతి మనస్తాపం

పెళ్ళికి మళ్ళీ గడువు కావాలన్న ప్రియుడి తీరుతో యువతి మనస్తాపం


కానీ అబ్బాయి విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్న అమ్మాయి ఆరు నెలల గడువు తర్వాత తనను పెళ్లి చేసుకుంటాడని బలంగా విశ్వసించింది. అయితే ఊహించని విధంగా పంచాయితీలో పెద్దలు చెప్పిన సమయం అయిపోయిన తర్వాత కూడా, అతను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి మరో ఆరు నెలల సమయం కావాలని కోరాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

సూసైడ్ లెటర్ రాసి, ప్రియుడి బొమ్మ గీసి ఆత్మహత్య

సూసైడ్ లెటర్ రాసి, ప్రియుడి బొమ్మ గీసి ఆత్మహత్య


ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి, ప్రియుడి బొమ్మ గీసి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ లెటర్ లో యువతి అమ్మానాన్న మళ్లీ ముందు ఓడిపోయా.. అందరి ముందు ప్రశ్నగా మిగిలిపోయా.. పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ 6 నెలలు గడువు పెట్టి తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.. నాకు బ్రతకాలని లేదు అంటూ ఆ యువతి సూసైడ్ నోట్ లో రాసింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని యువకుడి ఇంటి ముందుకు తీసుకొచ్చి ఆందోళన చేశారు

ప్రియుడి ఇంటి ముందు మృతదేహంతో యువతి కుటుంబం ఆందోళన

ప్రియుడి ఇంటి ముందు మృతదేహంతో యువతి కుటుంబం ఆందోళన


అతడే సర్వస్వంగా నమ్మి ప్రేమించిన యువతి ప్రాణాలను బలి తీసుకున్న యువకుడిని, అలాగే పెళ్లికి వాయిదాలు వేస్తూ తీర్పు చెప్పిన పెద్దమనుషులను శిక్షించాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. యువతి ఆత్మహత్య ఘటన తెలిసిన స్థానికులు యువకుడిని శిక్షించి, నిరుపేద యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ప్రియుడు, పెద్దమనుషుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ కుమార్తె మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+