అర్దరాత్రి స్మశానంలో యువతి ఏడుపు.. షాకైన జనం.. అసలేం జరిగిందంటే!!

ఆదివారం పంజాగుట్టలో అర్ధరాత్రి సమయంలో స్మశానంలో యువతి హల్చల్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద అర్ధరాత్రి ఓ యువతి రెండు గంటలపాటు రచ్చ చేసింది. స్మశానంలో ఏడుస్తూ కూర్చుంది. మొదట స్మశానంలో మహిళ ఏడుపు విని భయపడిన స్థానికులు, నిదానంగా అక్కడ ఉన్నది ఒక యువతి అని గుర్తించారు.

ఆ యువతి స్మశానంలో ఒక వ్యక్తిని ప్రేమించానని, అతను తనను వదిలేశాడని నానా న్యూసెన్సు చేసింది. ఏడుపులు, పెడబొబ్బలు పెట్టింది. అర్ధ రాత్రి పన్నెండు గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు గొడవ జరిగింది. తన ప్రియుడు తనను విడిచి పెట్టాడు అని స్మశానంలో కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించింది.

graveyard

ఇక అర్ధరాత్రి స్మశానంలో యువతి ఏడుస్తూ ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆమె వివరాలు తెలుసుకొని ఏమైంది అంటూ మొదట ప్రశ్నించారు. తనను ప్రేమించిన అబ్బాయి తనను మోసం చేశాడని, తనను వదిలి వెళ్లిపోయాడని పేర్కొన్న యువతి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. అతను లేని జీవితాన్ని ఊహించుకోలేనని పేర్కొంది. దీంతో ఆ యువతిని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించిన స్థానికులు, ఎంతసేపటికి యువతి వినకపోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని స్మశానవాటిక నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక పోలీసులు యువతిని తీసుకు వెళ్ళడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి స్మశానంలో యువతి ఏడుస్తూ గొడవ చేయడంతో రోడ్డుపై వెళ్ళే ప్రయాణికులు అలాగే చూస్తూ ఉండిపోయారు.

ఇంతకీ ఆ యువతి ఎవరు? ఆమె ఎక్కడ ఉంటారు? పంజాగుట్ట స్మశానానికి ఎందుకు వచ్చారు? ఆమెను మోసం చేసిన వ్యక్తి ఎవరు? అసలేం జరిగింది? వంటి వివరాలను తెలుసుకొని, పోలీసులు, మహిళకు బహిరంగంగా న్యూసెన్స్ చేయడంపై కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+