ఆత్మహత్యకు ముందు సాయి సెల్పీ వీడియో, ఎందుకంటే?

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నాడు చోటు చేసుకొంది.

హైద్రాబాద్ నగరంలో ని సరూర్ నగ‌ర్ లో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉండే 21 ఏళ్ళ సాయి అనే యువకుడు ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడకు చెందినవాడుగా గుర్తించాడు.

Youngster shoots selfie video, then hangs self in Hyderabad

ఆత్మహత్యకు పాల్పడే ముందు అయన తన మరణానికి కారణాలు చెప్పలేదు. కానీ, తనకు బతకాలని లేదని చెప్పినట్టు ఆ వీడియోలో ఉందని పోలీసులు చెబుతున్నారు.

అయితే ప్రైవేట్ ఉద్యోగాల కోసం సాయి పలు ఇంటర్వ్యూలకు హజరయ్యారు. అయితే ఆయన ఉద్యోగాలు దక్కలేదంటున్నారు. బుధవారం నాడు కూడ ఆయన ఇంటర్వ్యూకు హజరై తిరిగి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో రూమ్ లో ఎవరూ లేరు. సాయి రూమ్మేట్స్ బయటకు వెళ్ళారు. దీంతో ఒంటరిగా ఉన్న సాయి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు.

నిరాశ నిస్పృహలతోనే సాయి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే సాయి మృతికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+