వివాహమైనా మరదలితో అక్రమ సంబంధం: పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన మరదలితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమెకు వేరే వ్యక్తితో వివాహమైంది. కాగా, తన మరదలుకు వివాహమైన తర్వాత కూడా ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడతడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలపాలయ్యాడు.

నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్‌రెడ్డినగంకి చెందిన శ్రీశైలం (22) చికెన్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. చంపాపేటలోని మారుతీనగర్‌కి చెందిన పద్మ (20)తో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేదు.

extramarital affair

పద్మ బావ నల్గొండ జిల్లా అరగన్లపల్లికి చెందిన మల్లేశం(21) దిల్‌సుఖ్‌నగర్‌ పరిధి మధురాపురిలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, ఇటీవల బావ మల్లేశంతో పద్మకు తిరిగి పరిచయం ఏర్పడింది.

ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న పద్మ.. ఏప్రిల్ నెలలో మారుతీనగర్‌కు వచ్చింది. కొన్ని రోజులకు శ్రీశైలం తనకు నచ్చలేదని చెప్పి అదృశ్యమైంది. దీంతో శ్రీశైలం.. మల్లేశంపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు మధురాపురిలో విచారించగా పద్మ, మల్లేశం పట్టుబడ్డారు. భర్తతో ఉండేందుకు నిరాకరించిన పద్మను ఆమె తల్లికి అప్పగించామని ఎస్సై ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మల్లేశంను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth allegedly arrested for extramarital affair with married woman in Hyderabad on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి