దారుణం: వాట్సప్‌లో యువతి నగ్న చిత్రాలను షేర్ చేసి అరెస్టయ్యాడు

హైదరాబాద్: యువతి నగ్న చిత్రాలను వాట్సప్‌ ద్వారా తన స్నేహితులకు షేర్ చేసిన ఓ యువకుడిపై తెలంగాణ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని చోటు చేసుకుంది. కమ్మర్ పల్లి మండలం ఎస్‌ఐ పెండ్యాల ప్రభాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని చౌట్ పల్లి గ్రామానికి చెందిన కుంటాలపల్లి నరేష్ తన స్మార్ట్ ఫోన్‌తో అదే గ్రామానికి చెందిన ఓ యువతి నగ్న చిత్రాలను తీశాడు. అంతటితో ఆగకుండా ఆ నగ్న చిత్రాలను వాట్సప్ ద్వారా పలు గ్రూపుల్లో అప్‌లోడ్ చేయడమే కాకుండా తన స్నేహితులతో షేర్ చేసుకున్నాడు.

ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం ఉదయం నిందితుడు నరేష్‌ను లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి పిలిపించి దేవుడిపై ప్రమాణం చేయాలన్నారు. దీంతో భయపడిపోయిన నరేష్ ఆ ఫోటోలను తానే తీశానని ఒప్పకున్నాడు.

Youth arrested for sharing nude pics of a girl in nizamabad

అయితే వాట్సప్‌లో మాత్రం అప్‌లోడ్ చేయలేదన్నాడు. దీంతో గ్రామస్తులు నిందితుడిని ఆలయం నుంచి గ్రామ పంచాయితీ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాలని భావించారు. అంతక ముందు నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులు కోరగా నడిపించుకుంటూ జీపీ వద్దకు తామే తీసుకెళ్తామని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని ఎస్‌ఐ ప్రభాకర్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు చివరకు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

బోరబండలో దారుణం

బోరబండలోని సాయిబాబా నగర్లో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని శ్రీనివాస్ అనే వ్యక్తి పైన వీధి రౌడీలు దాడి చేశారు. అవమానం భరించలేక అతను నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+