కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్; రేవంత్ రెడ్డి హామీల వర్షం!!

హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాధన ఆకాంక్ష నెరవేరిన తరువాత కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాదు మనకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే యువ సంఘర్షణ సభకు ప్రియాంక గాంధీ వచ్చారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా కెసిఆర్ పాలనలో యువతకు న్యాయం జరగడం లేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీలు సామాజిక చైతన్యానికి వేదికలని, తెలంగాణ పౌరుషానికి ప్రతీక లని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన రాష్ట్రం మన కొలువులు నినాదంతో యువతీ యువకులు లాఠీ దెబ్బలు తిన్నారని, ప్రాణాలు సైతం అర్పించారని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదని వెల్లడించారు.

Youth Declaration in Congress Yuva Sangharshana meeting, Revanth Reddy assurances to youth!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం పోరాడిన వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామని,వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే తెలంగాణ సమరయోధులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు.నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి,సెప్టెంబరులో నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తామని, అన్ని జిల్లాలలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు వడ్డీలేని 10 లక్షల రూపాయల రుణాన్ని ఇస్తామని, యూత్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన చదువుకుంటున్న ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ అందజేస్తామని పేర్కొన్నారు . ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ లను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మారుస్తామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+