యువకుడి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా: రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్: ఇటీవల వరంగల్ ధర్మసాగర్ రిజర్వాయర్ ఘటన మరువక ముందే ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అన్నారం మండలం అక్కమ్మ చెరువు అలుగు వద్ద బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్ధానికంగా నివాసం ఉంటున్న రాము (24) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వరద ఉధృతి ధాటికి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
అయితే అతడిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. వరద ఉధృతి తగ్గిన తర్వాత రాము మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
నీటి కాలువలో చిన్నారి పడి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిరుమల(2) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నీటికాలువలో పడ్డాడు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించకపోవడంతో అతడు నీట మునిగి మృతి చెందాడు.
హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం
వర్షం దెబ్బకు నగర వాసులు బెంబేలెత్తుతున్నా వరుణుడు మాత్రం వదలిపెట్టడం లేదు. బుధవారం మధ్యాహ్నం మరోసారి నగరంలో వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికే సగటు జీవుడు జీవనం అతలాకుతలం కాగా, ఇప్పుడు మరోసారి వర్షం పడుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, అమీర్‌పేట్, సరూర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, పంజాగుట్ట, శేరిలింగంపల్లి, ఎస్.ఆర్ నగర్, షాపూర్, మూసాపేట, అల్విన్‌కాలనీల్లో మరోసారి వర్షం కురుస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications