హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఇంటివద్ద యూత్ హంగామా, దాడి, ఫిర్యాదు: కెసిఆర్‌పై యాష్కీ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి ఎదుట కొందరు యువకులు బుధవారం నాడు హల్‌చల్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం ఎదుట హంగామా చేశారు. దీంతో, పవన్ కళ్యాణ్ బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గుజరాత్‌లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఈ రోజు కొందరు యువకులు పవన్ కళ్యాణ్ ఇంటి ఎదుటకు వచ్చారు. వారు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారు. నానా రచ్చ చేశారు.

వారు నానా రచ్చ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇంటి వాచ్‌మెన్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారంతా కలిసి అతనిని చితకబాదారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ బౌన్సర్లు వారికి ఎదురు తిరిగారు. దీంతో ఆ యువకులు పారిపోయారు. అనంతరం బౌన్సర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Youth hungama at Pawan Kalyan residence

కిషన్ రెడ్డిపై చీటింగ్ కేసు పెడతాం: జోగు రామన్న

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన చీటింగ్ కేసు పెడతామని మంత్రి జోగు రామన్న అదిలాబాద్ జిల్లాలో అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఆత్మహత్యలు ఆగకపోవడం బాధాకరమన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ కురిపిస్తుందన్నారు.

కెసిఆర్, బాబు రాజకీయాల్లో నటిస్తున్నారు: యాష్కీ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇద్దరు చంద్రులు (కెసిఆర్, చంద్రబాబు) చీకట్లు చూపిస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ మండిపడ్డారు. చంద్రబాబు దివంగత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు.

ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తే బాబు, కెసిఆర్ రాజకీయాల్లో నటిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తప్పించుకునేందుకే వారు కలిశారని ఆరోపించారు. సిఎం కెసిఆర్‌కు ఎర్రవల్లి ఉత్తమ సర్పంచిగా అవార్డు ఇవ్వాలన్నారు. కెసిఆర్ తీరు సీఎంగా కాకుండా గ్రామ సర్పంచిగా ఉందన్నారు.

English summary
Youth hungama at Jana Sena chief Pawan Kalyan residence on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X