షాకింగ్: మరదలిని పెళ్లాడేందుకు ప్రియురాల్ని చంపేశాడు
హైదరాబాద్: తెలంగాణలోని మేడ్చల్ ప్రాంతంలో దారుణం జరిగింది. మరదలిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు ఎంతో కాలంగా ప్రేమించిన ప్రియురాలినే హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మేడ్చల్ ప్రాంతంలోని బండ మాదారానికి చెందిన మహేందర్, స్వప్నలు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత మహేందర్ తన మరదలిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మరదలిని పెళ్లి చేసుకునేందుకు ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
నాలుగు రోజుల క్రితం ప్రియురాలు స్వప్నను పిలిపించుకున్నాడు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమెను హత్య చేశాడు. స్వప్న నాలుగు రోజులైనా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మహేందర్ హత్య చేసినట్లు తేలింది.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
ఔటర్ సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. తెలంగాణ పోలీసు అకాడమిలో డీఎస్పీగా పనిచేసే నాగేంద్రుడు కుమారుడు విశ్వభరత్ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు.
సోమవారం రాత్రి గచ్చిబౌలి వైపు నుంచి పోలీసు అకాడమికి తన బైక్ పైన వస్తుండగా మంచిరేవుల గ్రేహౌండ్స్ సమీపంలో వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలకు గురైన విశ్వభరత్ అక్కడికక్కడే మృతి చెందాడు.












Click it and Unblock the Notifications