పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు: డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు ఓ యువతిని మోసం చేశాడు. ఈ సంఘటన హైదరాబాదు శివారులోని రాజేంద్రనగర్‌లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ మండలం నార్సింగిలో మోహన్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి చేసుకుంటాని నమ్మించాడు.

అలా నమ్మించిన మోహన్ ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. అయితే, పెళ్లి మాటను అతను ఎత్తడం లేదు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు నిందితుడిని పట్టుకోవడం లేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

హైదరాబాద్ నగరంలోని కాచీగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు 100 ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం డ్రగ్స్ ముఠా గుట్టురైట్టెంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Youth made a girl pregnant at rajendra nagar

పోలీసుల చెంత బాలుడు

మహబూబ్‌నదక్ డిస్సా నాగర్‌కర్నూల్ పట్టణంలో ఓ గుర్తు తెలియని బాలుడిని పోలీసులు చేరదీశారు. ఎస్ఐ ప్రదీప్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుటుంబం నుంచి దూరమైన ఓ నాలుగేళ్ల బాలుడు పట్టణంలో ఏడుస్తూ కనిపించాడు. గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే ఆ బాలుడు వివరాలు చెప్పలేకపోయాడు.

దీంతో ఆ బాలుడిని పోలీసు స్టేషన్‌లోనే ఉంచుకొన్నారు. అనుకోకుండా తప్పిపోయాడో, కావాలని వదిలేశారోననే విషయాల్లో స్పష్టత రాలేదు. దీంతో కొద్ది రోజులు పోలీస్ స్టేషన్‌లోనే ఆ బాలుడిని ఉంచుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా బాలుడు తప్పిపోయినట్లు తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరైనా సమాచారం తెలిస్తే 9440795733 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్‌ఐ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+