మైనర్ బాలికపై 6గురు యువకులు రేప్ యత్నం

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా చేర్యాలలో దారుణం వెలుగు చూసింది. ఆరుగురు యువకులు మృగాళ్లలా ప్రవర్తించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చేర్యాలకు చెందిన ఓ మైనర్‌ బాలిక (14)ను తన సోదరుడు తీసుకు రమ్మన్నాడని చెప్పి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

శివారులోకి బాలికను తీసుకెళ్లి మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

మహిళా మావోయిస్టు లొంగుబాటు

Youth tried to kidnap girl

నిషేధిత సీపీఐ మావోయిస్టు మహిళా సభ్యురాలు, జనతన్‌ సర్కార్‌(మావోయిస్ట్‌ పార్టీ అను బంధ సంస్థ) ఇంఛార్జ్ సుగుణ శనివారం వరంగల్‌ ఓఎస్డీ సన్‌ప్రీత్ సింగ్‌ సమక్షంలో లొంగిపోయారు. సుగుణ ఛత్తీస్‌‌గఢ్‌లోనిపామెడ, కుంట, ఎర్రారం ఏరియాల్లో పని చేసింది. ఆమెపై ప్రభుత్వం రూ.1లక్ష రివార్డును ప్రకటించింది. లొంగిపోయిన సుగుణకు తాత్కాలిక ఆర్థిక సహాయంగా రూ.5వేలను అందించారు.

డిటోనేటర్ పేలి వ్యక్తి మృతి

అడవి పందులను వేటాడేందుకు డిటోనేటర్లను తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో మృతుని భార్యకు తీవ్ర గాయాలయ్యాయ. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలంలోని గుడిపల్లి సమీపంలో శనివారం చోటుచేసుకుంది.

దేవరకొండకు చెందిన లింగయ్య, ఇందిరమ్మ దంపతులు గత రెండు రోజుల క్రితం అడవిపందులను వేటాడేందుకు మండలంలోని గుడిపల్లి గ్రామానికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని గుడిపల్లిగట్టు వద్ద డిటోనేటర్లను ఒక టిఫిన్ బాక్స్‌లో పెట్టుకొని వెళ్తుండగా మార్గమధ్యలో అవి ఒక్కసారిగా పేలడంతో లింగయ్య అక్కడిక్కడే మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+