టిఆర్ఎస్ కోసమే జగన్ ప్రచారం, కవిత షాడో సిఎం: గుత్తా వ్యాఖ్య
వరంగల్/ హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రచారం చేయడమంటే పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కు మద్ధతు ఇవ్వడమేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఓటమి భయంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని టిఆర్ఎస్ వరంగల్‌లో పోటీకి దింపిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌తో వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని అని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కవిత షాడో సీఎంలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

బిజెపి నాయకుడు సుబ్రమణ్య స్వామి పిచ్చిముదిరిన మేధావని అని గుత్తా వ్యాఖ్యానించారు. తమ పార్టీ నాయకుడు రాహుల్‌పై సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని టిఆర్ఎస్ అసత్యాలు చెబుతోందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications