షర్మిలకు తత్వం బోధపపడింది - రిటర్న్ బ్యాక్...!!

వైఎస్ షర్మిల అనుకున్నది ఒకటి. జరుగుతోంది మరొకటి. కాంగ్రెస్ లో చేరటం..తన పార్టీ విలీనం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆశించారు. పలు దఫాలు చర్చలు చేసారు. అనేక ప్రతిపాదనల పైన మంతనాలు జరిగాయి. డీకే శివకుమార్ రాయబారం...నేరుగా సోనియా, రాహుల్ తో మంతనాలు కొనసాగాయి. కానీ, షర్మిల ప్రతిపాదనలకు ఆమోదం దక్కలేదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం అర్దమైన షర్మిల ఇప్పుడు ఆ పార్టీతో విలీనానికి బ్రేక్ చెప్పారు. సొంతగా పోటీకి సిద్దమయ్యారు.

కాంగ్రెస్ మార్క్ రాజకీయం:రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభించారు. కానీ, పార్టీ నిర్మాణంలో సక్సెస్ కాలేదు. కొద్ది నెలలుగా షర్మిల కాంగ్రెస్ లో చేరి పోటీ చేయటం..పార్టీ విలీనం పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ విలీనం ద్వారా తెలంగాణలో షర్మిలకు తగిన గుర్తింపు..పాలేరు పోటీకి సీటు.. అనుచరలకు ప్రాధాన్యత అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా మరి కొందరు తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యత వ్యతిరేకించారు. షర్మిలను ఏపీకి పరిమితం చేయాలని సూచన చేసారు. కానీ, షర్మిల తాను తెలంగాణలోనే పని చేస్తానని తేల్చి చెప్పారు. సోనియా, రాహుల్ తోనూ చర్చలు చేసారు. కానీ, ఫలితం రాలేదు.

YS Sharmila breaks merge proposal with Congress, decided to contest from Paleir

షర్మిల ప్రతిపాదనలకు నో:షర్మిలకు తొలుత రాజ్యసభ ప్రతిపాదించారు. కాదంటే, ఫైనల్ గా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం ఇస్తామనే చర్చ తెర మీదకు వచ్చింది. షర్మిల తనకు పాలేరు సీటు ఇవ్వాలని పట్టు బట్టారని తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్ నాయకత్వం నో చెప్పింది. షర్మిల అనుచర వర్గానికి సంబంధించి ఎటువంటి హామీ దక్కలేదు. సెప్టెంబర్ 30 వరకు కాంగ్రెస్‌కు షర్మిల డెడ్‌లైన్ విధించడంతో వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగి డీల్ ప్రతిపాదించారు. ఖమ్మం లోక్ సభ ప్రతిపాదించారు. దీంతో, రెండు రోజులుగా ఢిల్లీలోనే షర్మిల మకాం వేసారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో, ఆక కాంగ్రెస్ తో విలీనం ప్రక్రియకు బ్రేక్ చెప్పారు. తన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. సొంతంగా పోటీకి నిర్ణయించినట్లు సమాచారం.

ఒంటరి పోరుకు సిద్దం:ముందుగా అనుకున్నట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి షర్మిల బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసు, వైఎస్సార్ విగ్రహాన్ని కూడా షర్మిల ప్రారంభించారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి బరిలోకి దిగనున్నారు.

ఇదే సమయంలో 119 నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపడానికి సన్నాహాలు ప్రారంభించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి సానుకూలంగా షర్మిల డిమాండ్ల పైన స్పందించి ముందుకు వస్తే మినహా వైఎస్సార్టీపీ ఎన్నికల్లో ఒంటరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఈ ఎన్నికల్లో తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+