ఇంకెంత మంది రైతులు చస్తే మీ కళ్ళు చల్లబడతాయి: సీఎం కేసీఆర్ కు వైయస్ షర్మిల సూటిప్రశ్న

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ రైతాంగాన్ని కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల, తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల తెలంగాణ రైతాంగ దీన పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.

కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు

కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు

వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శించారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు వైయస్ షర్మిల. ఇవాళ మరో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు అంటూ సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఇంకెంత మంది తెలంగాణ రైతులను బలితీసుకుంటారో సీఎం కేసీఆర్ చెప్పాలంటూ నిలదీశారు.

 తమరు పంట కొనక కాటికి పంపుతున్నారు : కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల

తమరు పంట కొనక కాటికి పంపుతున్నారు : కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల

రైతులు కోటీశ్వరులను చేశాం.. కార్లలో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అంటూ వైయస్ షర్మిల కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఒక్కసారి ఫాంహౌస్ మత్తు నుంచి బయటకు వస్తే తెలుస్తుంది రైతులు కోటీశ్వరులు కావడం కాదు... తమరు ఉరికొయ్యకు ఉరి వేస్తున్నారని అంటూ షర్మిల మండిపడ్డారు. తమరు పంట కొనక కాటికి పంపుతున్నారని కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ వైయస్ షర్మిల మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను, అలాగే సిద్దిపేట జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో కౌలు రైతు మరణించిన విషాద ఘటన తాలూకు పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసిన షర్మిల తెలంగాణ సీఎం కెసిఆర్ పాలనలో రైతుల పరిస్థితి ఇలా ఉందంటూ పేర్కొన్నారు.

రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై షర్మిల ఆవేదన

రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై షర్మిల ఆవేదన


రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరవాలని రైతాంగాన్ని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.అంతకు ముందు కూడా షర్మిల ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివపురం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కుమార్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పై సీఎం కేసీఆర్ ను నిలదీశారు. ఆరుగాలం చెమటోడ్చి వడ్లు పండించిన రైతులకు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా కేసీఆర్ గారు? వడ్లు కొనరనే బాధతో ఆత్మహత్య చేసుకున్న ఈ రైతు కుటుంబానికి ఏం సమాధానం చెబుతున్నారు? ఓట్ల కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారు.. వడ్లు కొనడానికి మాత్రం మనసొప్పదా? మీది గుండెనా? బండనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణా రైతుల పరిస్థితి చెప్పి దొరగారు అంటూ కేసీఆర్ పై షర్మిల టార్గెట్

తెలంగాణా రైతుల పరిస్థితి చెప్పి దొరగారు అంటూ కేసీఆర్ పై షర్మిల టార్గెట్

రైతులకు కనీస భరోసా కల్పించలేని ఆ ముఖ్యమంత్రి పదవి మీకెందుకు? మండిపడ్డారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, వడ్లు కొనక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. మీవైతే ప్రాణాలు.. ప్రజలవి ప్రాణాలు కావా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మిమల్ని ఈ సమాజం ఎన్నటికీ క్షమించదు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల .అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది తెలంగాణ రైతుల పరిస్థితి అని పేర్కొన్న షర్మిల దొరగారి గలీజ్ మాటలు గందరగోళ పాలనతో అరిగోస పడుతున్నారు రైతులు అంటూ అసహనం వ్యక్తం చేశారు హిందీ నీళ్లు ఉన్న వరి సాగు చేయలేని దుస్థితి తెలంగాణ రైతాంగం ఉందని పేర్కొన్న ఆమె, యాసంగి లో వేస్తే ఉరే.. వరి కొననన్న కేసీఆర్ గారు అంటూ కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్య విషయంలో కెసిఆర్ ను వదిలిపెట్టకుండా వైయస్ షర్మిల టార్గెట్ చేస్తూనే ఉన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+